Switch to English

బిగ్‌ స్టోరీ: కరోనా వైరస్‌కి వ్యాక్సిన్‌ ఎప్పుడొస్తుందంటే.!

కరోనా వైరస్‌.. శరవేగంగా ప్రపంచాన్ని చుట్టేసింది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌.. జన్మభూమి మీద తక్కువ ప్రభావం చూపినా, ప్రపంచాన్ని మాత్రం వణికించేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా కూడా కరోనా వైరస్‌ దెబ్బకి విలవిల్లాడుతున్న విషయం విదితమే. ఇక, మన దేశంలోనూ కరోనా వైరస్‌ తీవ్ర రూపం దాల్చినట్లే కన్పిస్తోంది. చాపకింద నీరులా దేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్‌, లక్ష మార్కు అందుకోవడానికి వడివడిగా అడుగులేస్తోంది.

కరోనా వైరస్‌కి వ్యాక్సిన్‌ వచ్చేదాకా దాంతో సహజీవనం చేయాల్సిందేనని ప్రభుత్వాలు చెబుతున్నాయంటే.. పరిస్థితి తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. కరోనా వైరస్‌తో సహజీవనం చేయడమేంటి.? అని జనం ముక్కున వేలేసుకుంటున్నాసరే.. ప్రభుత్వ పెద్దలు మాత్రం.. నిర్మొహమాటంగా ఆ విషయాన్ని పదే పదే కుండబద్దలుగొట్టేస్తున్నారు.

నిజానికి, చైనాలో కరోనా వ్యాప్తి చెందుతున్నప్పుడే మన భారత ప్రభుత్వం అప్రమత్తమయి వుండాల్సింది. కానీ, చిన్నపాటి అలసత్వం.. ఇప్పుడు దేశం కొంప ముంచేసింది. ఇంతకీ, కరోనా వైరస్‌కి వ్యాక్సిన్‌ ఎప్పుడొస్తుంది.? ఇది మాత్రం ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. అదిగో, అక్కడ కరోనా వైరస్‌ కనిపెట్టేశారు.. ఇదిగో ఇక్కడ వ్యాక్సీన్‌ పరీక్షలు విజయవంతమయ్యాయి.. అంటూ నిత్యం వార్తలు వింటూనే వున్నాం. కానీ, వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని, ప్రముఖ వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

వ్యాక్సిన్‌ ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి వస్తే.. అది గొప్ప విషయమేనని వ్యాక్సిన్ల తయారీ రంగ ప్రముఖులు తేల్చి చెబుతుండడం గమనార్హం. ఇప్పటికే దాదాపు 100కి పైగా వ్యాక్సీన్లను అభివృద్ధి చేసినప్పటికీ.. అవన్నీ ప్రయోగాల దశ దాటాల్సి వుంటుంది. ప్రతి ప్రయోగంలోనూ అనేక సమస్యలు, సవాళ్ళు ఎదురవుతాయి. వాటన్నిటినీ అధిగమించి, వాక్సీన్‌ని అందుబాటులోకి తీసుకురావడమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు.

ఈలోగా ప్రభుత్వాలు చెప్పినట్లు, ఇష్టం లేకపోయినా కరోనాతో సహజీవనం చేయక తప్పదు. ఎందుకంటే, పాలకులు చేతులెత్తేశారు మరి.!

సినిమా

దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా...

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

ఫోన్‌ గొడవతో గృహిణి ఆత్మహత్య

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం వగరూరు గ్రామానికి చెందిన నాగరాజు మరియు పార్వతిలకు ఆరు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు నాలుగు సంవత్సరాలు కాగా ఏడాది...

ఎబోలా మళ్లీ వచ్చింది.. ఈసారి నష్టం మరింత ఎక్కువ

2018 సంవత్సరంలో ప్రపంచాన్ని భయపెట్టిన ఎబోలా ఆ సమయంలో పెద్దగా నష్టపర్చలేదు. కొన్నాళ్లకే ఎబోలా కనుమరుగయ్యింది. దాని గురించి మర్చి పోయి అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో కరోనా వైరస్‌ మొదలైంది. ఇప్పటికే...

క్రికెట్‌పై కరోనా ఎఫెక్ట్‌: ఇకపై అవేవీ కన్పించవా.?

కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. ‘ఏదీ ఇంతకు ముందులా వుండదు..’ అని కరోనా వైరస్‌పై నిపుణులు తమ అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టేస్తున్న విషయం విదితమే....

డబ్బు కోసం ఎన్నారైకి గృహిణి వల.. పెళ్లి చేసుకుందామంటూ..

తేలికగా డబ్బు సంపాదించి విలాసంగా బతికేద్దామనుకుంది ఆ కుటుంబం. ఓ ఎన్నారైను మోసం చేసి లక్షల్లో డబ్బు వసూలు చేయటానికి ప్రయత్నించింది ఆ ఇంటి ఇల్లాలు. చేయాలనుకున్న మోసం చేసి చివరకు పోలీసులకు...

ప్రత్యేక హోదాపై వైఎస్‌ జగన్‌ ఆశాభావం.. ఇదేం రాజకీయం.?

ప్రత్యేక హోదా విషయమై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆ వ్యాఖ్యలు ప్రత్యేక హోదాపై వైఎస్సార్సీపీ ‘చేతులెత్తేసిన వైనాన్ని’ స్పష్టం చేస్తున్నాయి....