Switch to English

కరోనా వైరస్‌: తెలుగు రాష్ట్రాల్లో ఈ ‘చావుల’ లెక్కేంటి.?

నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి.. చాలామంది ప్రాణాలు కోల్పోతుంటారు. కానీ, ఇప్పుడు వాటి గురించిన చర్చ చాలా తక్కువగా జరుగుతోంది. ఎందుకంటే, రోడ్లపై వాహనాల రద్దీ కన్పించడంలేదు. కొన్ని వాహనాలకు మాత్రమే రోడ్లపై తిరిగేందుకు అనుమతి వుంది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. దాంతో, రోడ్డు ప్రమాదాలు చాలా తక్కువగానే కన్పిస్తున్నాయి.

తాజాగా హైద్రాబాద్‌లో ఔటర్‌ రింగ్‌ రోడ్డు మీద ఓ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరోపక్క, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి వంతెన మీద, పోలీసులు అడ్డుగా పెట్టిన ఓ తాడు, ఓ వ్యక్తి ప్రాణాల్ని బలిగొంది. ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి విధి నిర్వహణలో భాగంగా వెళుతూ, చీకట్లో తాడు కన్పించక ప్రమాదానికి గురయ్యాడు.

ఇదిలా వుంటే, కరోనా సోకిందన్న అనుమానంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సదరు వ్యక్తిని, గ్రామస్తులు కరోనా అనుమానితుడిగా భావించడంతోనే ఇదంతా జరిగిందట. ఇలాంటి వార్తలు మీడియాలో ‘బ్రేకింగ్‌..’ అంటూ ప్రచారం జరిగే సరికి, లేనిపోని భయాందోళనలు జనంలో పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్‌ ఎంత ప్రమాదకారి.. అనేది నమోదవుతున్న కేసులు, మరణాల్ని బట్టి తెలుస్తోంది.

అదృష్టవశాత్తూ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా కరోనా మరణాల్లేవు. దేశంలో ఈ మరణాల సంఖ్య 19కి చేరుకుందనుకోండి.. అది వేరే సంగతి. కరోనా వైరస్‌ చాలా ప్రత్యేకమైనది. ఇది అత్యంత వేగంగా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది కాబట్టి, లాక్‌ డౌన్‌ పూర్తిగా మన క్షేమం కోసమేనని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఏదో వాహనం దొరికింది కదా అని దొంగచాటుగా ప్రయాణాలు చేస్తే, ప్రమాదాల్ని కొనితెచ్చుకోవాల్సిందే. అదే సమయంలో, కరోనా అనుమానంతో.. ‘వెలివేయడం’ అనేది కూడా జుగుప్సాకరమైన, హేయమైన చర్య.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

రంజాన్‌ ‘నైట్‌ మార్కెట్‌’కి కరోనా చీకట్లు.!

హైద్రాబాద్‌ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది బిర్యానీ.. దాంతోపాటే, రంజాన్‌ స్పెషల్‌ అయిన హలీం. ఇంకో స్పెషల్‌ కూడా వుంది రంజాన్‌ సందర్భంలో. అదే నైట్‌ బజార్‌. హైద్రాబాద్‌లోని పాత బస్తీలోగల చార్మినార్‌ ప్రాంతంలోని...

ఫ్లాష్ న్యూస్: ఇండియాలో చొరబడేందుకు 540 మంది ఉగ్రవాదులు ఎదురు చూస్తున్నారట

పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇండియాలో ప్రవేశించి ఉన్మాదం సృష్టించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండియాలో అల్ల కల్లోలం సృష్టించడమే ప్రధాన లక్ష్యంగా వందలాది మంది ఉగ్రవాదులు ఇప్పటికే ఇండియాలోకి ప్రవేశించారు. ఇప్పుడు మరో...

దయనీయస్థితిలో బాలీవుడ్ నటుడు

కరోనా నేపథ్యంలో ఇండియాలో పెట్టిన లాక్ డౌన్ వల్ల చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఆర్ధిక ఇబ్బందులతో చాలా మంది అల్లాడిపోతున్నారు. వారిలో ప్రముఖ హిందీ నటుడు, మహాభారత్ సీరియల్ లో ఇంద్రుడి...

ఫ్లాష్ న్యూస్: వారెవ్వా.. తల్లి కోసం ఐదేళ్ల బాలుడు ఒంటరి ప్రయాణం.!

కరోనా మహమ్మారిని అడ్డుకోవడం కోసం ఇమ్మీడియట్ ఎఫెక్ట్ తో మార్చి లో లాక్ డౌన్ పెట్టడం వలన ఎక్కడి వారు అక్కడే లాక్ అయిపోయారు. చాలా మంది స్వస్థలాలకు వెళ్లాలని ప్రయత్నించి లాభం...

ఫ్లాష్ న్యూస్: ఆఫ్రికా నుండి ఇండియాకు చేరిన మిడుతల దండు

మొన్నటి వరకు ఆఫ్రికా దేశాలను అల్లాడించి అతలాకుతలం చేసిన మిడతల దండు పాకిస్తాన్ మీదుగా ఇండియా చేరింది. ప్రస్తుతం ఉత్తర భారతంలో ఈ మిడతల దండు రైతుల పాలిట రాక్షసులుగా మారాయి. పంట...