Switch to English

కిరాణా షాపుల నుంచీ కరోనా

ఏపీతో పోలిస్తే కరోనా కేసుల విషయంలో తెలంగాణ మెరుగ్గానే ఉంది. ఇప్పటికే 11 జిల్లాలను కరోనా రహిత జిల్లాలుగా ప్రకటించగా.. జీహెచ్ఎంసీ, సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో మినహా మిగిలిన జిల్లాల్లో గత 16 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ప్రస్తుతం నమోదవుతున్న కేసులన్నీ హైదరాబాద్ లోనివే. శనివారం 17 కేసులు వెలుగు చూడగా.. 15 హైదరాబాద్ లోను, రెండు కేసులు రంగారెడ్డి జిల్లాలోనూ నమోదయ్యాయి.

మర్కజ్ లింకుతో సంబంధం ఉన్న అన్ని కాంటాక్టులనూ దాదాపుగా చేధించామని ప్రభుత్వం చెబుతోంది. ఓ దశలో కేసుల నమోదయ్యే సంఖ్య గణనీయంగా తగ్గినా.. తాజాగా రెండు మూడు రోజుల నుంచి రెండు పదుల లోపు పాజిటివ్ లు నమోదవుతున్నాయి. మర్కజ్ లింకులు ముగిసినా కేసులు నమోదు కావడానికి కారణాలు ఏమిటా అని ఆరా తీయగా ఆసక్తికరమైన విషయం బయటపడింది. వీటిలో చాలా కేసులు కిరాణా షాపుల వల్ల వచ్చినవేనని తేలింది.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించినా.. నిత్యావసర వస్తువల లభ్యత కోసం కిరాణా షాపులు తెరచి ఉంచడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, వీరు హోల్ సేల్ మార్కెట్ నుంచి సరుకులు తెచ్చుకునేటప్పుడు కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో వైరస్ వ్యాప్తి పెరిగినట్టు గుర్తించారు. హైదరాబాద్ బేగంబజార్, మలక్ పేట గంజ్ హోల్ సేల్ మార్కెట్ నుంచి కిరాణా దుకాణదారులు సరుకులు తెచ్చి తమ కాలనీల్లో విక్రయిస్తున్నారు.

అయితే, ఆయా మార్కెట్లలో భౌతికదూరం, శానిటైజేషన్ వంటివి సక్రమంగా అమలు కాకపోవడం వల్ల అక్కడి నుంచి కిరాణా వ్యాపారులకు.. వారి నుంచి వారి కుటుంబ సభ్యులు, కొనుగోలుదారులకు వైరస్ సోకుతోంది. మలక్ పేటలో ఓ పల్లీనూనె వ్యాపారికి, వనస్థలిపురంలో ఓ కిరాణా షాపు యజమానికి మార్కెట్ నుంచి వైరస్ సోకగా.. వారి నుంచి వారి కుటుంబ సభ్యులందరికీ ఈ మహమ్మారి పాకింది. ఇక వారి నుంచి కిరాణా సామగ్రి కొనుగోలు చేసివారిలో ఎవరికైనా పాజిటివ్ ఉందో లేదో అన్నది తేలాల్సి ఉంది.

సూర్యాపేట జిల్లాలోనూ ఇబ్బడిముబ్బడిగా వైరస్ కేసులు పెరగడానికి కారణం అక్కడి మార్కెట్టేనని తేలింది. ఈ నేపథ్యంలో కిరాణా షాపుల నుంచి సరుకులు తెచ్చుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. తెచ్చిన వస్తువులను శానిటైజేషన్ చేయడం లేదా రెండు మూడు రోజులపాటు వాటిని ముట్టుకోకుండా ఎండలో ఉంచడం ద్వారా వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

సినిమా

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీకి క్రెడిట్‌ ఇస్తారెందుకు.!

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

ఇన్‌సైడ్‌ స్టోరీ: టీడీపీ గ్రాఫ్‌ కిందికి.. జనసేన గ్రాఫ్‌ పైపైకి.!

2019 ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి చెంప పెట్టు.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అధికారం కోల్పోవడం ఓ ఎత్తయితే.. అత్యంత ఘోరమైన పరాజయం ఇంకో ఎత్తు. మామూలుగా అయితే, ఏ...

బీహార్ బాలిక సాహసానికి ఇవాంకా ఫిదా.!

ప్రమాదానికి గురై నడవలేని స్థితిలో ఉన్న తండ్రిని సైకిల్ పై కూర్చోబెట్టుకుని ఏకంగా 1200 కిలోమీటర్లు ప్రయాణించిన 15 ఏళ్ల బీహార్ బాలికపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్...

రంజాన్‌పై కరోనా ఎఫెక్ట్‌: నష్టం కోట్లలోనే.!

రంజాన్‌ సీజన్‌ వచ్చిందంటే ఆ సందడే వేరు. నెల రోజులపాటు పండగ వాతావరణం కన్పిస్తుంటుంది. కరోనా వైరస్‌ దెబ్బకి రంజాన్‌ ఈసారి వెలవెలబోతోంది. ఇది హైద్రాబాద్‌ పరిస్థితి మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా.. ఆ...

రంజాన్‌ స్పెషల్‌: ఇఫ్తార్‌.. ఈ ఏడాదికి ఇంతే.!

ఇస్లాం మతంలో ఇఫ్తార్‌ విందుకి ఎంతో ప్రత్యేకత వుంది. రంజాన్‌ సీజన్‌లో ఇఫ్తార్‌ విందులు చాలా చాలా ప్రత్యేకమైనవి. ప్రభుత్వాలు సైతం ఇఫ్తార్‌ విందుల్ని ఏర్పాటు చేస్తుంటాయి అధికారికంగా. ముస్లింల ఓటు బ్యాంకు...