Switch to English

కరోనా (కోవిడ్‌19)తో స్వీడన్ పోరాటం.. సరికొత్తగా.!

ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్‌ దెబ్బకి విలవిల్లాడుతున్నాయి. 30 లక్షలకు చేరువగా వెళుతున్నాయి కరోనా పాజిటివ్‌ కేసులు. మృతుల సంఖ్య 2 లక్షలకు చేరుకోబోతోంది. అగ్రరాజ్యం అమెరికానే కరోనా దెబ్బకు కుదేలవడం గమనార్హం. అయితే, ఓ చిన్న దేశం స్వీడన్‌ మాత్రం కోరోనా వైరస్‌ (కోవిడ్‌19)పై పోరాటంలో సరికొత్త పంథా ఎంచుకుంది. వ్యాక్సిన్ల కోసం ఎదురుచూడటం తప్ప ఇంకేమీ చేయలేని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్‌ వైపు మొగ్గు చూపితే, స్వీడన్ మాత్రం ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’పై ఆశలు పెట్టుకుంది.

ఇప్పటికే ఆ ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ కారణంగా సత్పలితాలు ఇస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు స్వీడన్ పబ్లిక్‌ హెల్త్‌ ఏజెన్సీ చీఫ్‌ ఎపిడమయాలజిస్ట్‌ ఆండ్రెస్‌ టెగ్నెల్‌. హై రిస్క్‌ గ్రూప్‌కి చెందిన వారిని కరోనా వైరస్‌ ఎక్స్‌పోజర్‌కి దూరంగా వుంచుతున్నామనీ, ఎవరైతే కరోనా వైరస్‌ని తట్టుకోగలరో వారి విషయంలో ఆంక్షలు లేవని టెగ్నెల్‌ పేర్కొన్నారు.

స్టాక్‌హామ్ లో ఈ హెర్డ్‌ ఇమ్యూనిటీ కారణంగా కరోనా వైరస్‌ అదుపులోనే వుందనీ, అలాగని కేసుల సంఖ్య తక్కువగా వుందనిగానీ, మరణాలు చోటు చేసుకోవడంలేదనిగానీ చెప్పబోమని ఆయన వివరించారు. నిజానికి ఈ తరహా ప్రయోగం ప్రమాదకరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ‘హర్డ్‌ ఇమ్యూనిటీ’తో ప్రయోజనాలే ఎక్కువన్నది స్వీడన్‌ హెల్త్‌ ఏజెన్సీ అభిప్రాయం. ఓ మనిషికి సాధారణంగానే ఇమ్యూనిటీ వుంటుంది. అది వైరస్‌లతో పోరాడుతుంది. పూర్తి ఆరోగ్యంతో, పూర్తి ఇమ్యూనిటీతో వున్నవారిలో వైరస్‌ ప్రభావం పెద్దగా వుండకపోవచ్చు.

ఓసారి వైరస్‌ ఆరోగ్యవంతుడైన వ్యక్తి శరీరంలోకి వచ్చాక, మన శరీరంలోని ఇమ్యూనిటీ సిస్టమ్ యాక్టివేట్‌ అవుతుంది. ఆ తర్వాత ఆ వైరస్‌ని శరీరం తట్టుకోగలగుతుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు చెబుతున్నమాటే. అయితే, కరోనా వైరస్‌ ఒకరి నుంచి చాలామందికి చాలా చాలా వేగంగా విస్తరిస్తుండడమే అసలు ప్రమాదానికి కారణం.

సరిహద్దు దేశాల్లో లాక్‌డౌన్‌ అమల్లో వున్నా, అలాంటి లాక్‌డౌన్‌ ఆంక్షలేమీ లేకుండా స్వీడన్‌, హెర్డ్‌ ఇమ్యూనిటీపై ఫోకస్‌ పెడుతూ, కరోనా వైరస్‌ని అదుపులో పెట్టడం ఆశ్చర్యకరమే. అయితే, ఇది ప్రమాదకరమైన ప్రయోగమనీ, ఇమ్యూనిటీ తక్కువ వున్నవారు, వృద్ధులు, చిన్నారులు కరోనా వైరస్‌కి బలైపోవడం బాధాకరమని విమర్శకులు తమ విమర్శలకు పదును పెడుతున్నారు.

సినిమా

దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా...

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

రివ్యూ : రక్తాంచల్ (వెబ్ సిరీస్)

నటీనటులు : నికితిన్ ధీర్, క్రాంతి ప్రకాష్ ఝా, సౌందర్య శర్మ, రోంజిని చక్రవర్తి, చిత్తరంజన్ త్రిపాఠి తదితరులు. నిర్మాణం : ఎంఎక్స్ ప్లేయర్ దర్శకత్వం: రితమ్ శ్రీవాస్తవ్ నిడివి : 86 నిముషాలు విడుదల తేది :...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

పుల్వామా తరహా కుట్రను భగ్నం చేసిన భద్రతా దళాలు

భారత భద్రతా దళాలపై 2019లో ఉగ్రవాదులు చేసిన పుల్వామా ఎటాక్ అంత తేలిగ్గా మరచిపోయేది కాదు. 40మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకున్న ముష్కరులు అదే తరహాలో మరో భారీ కుట్రకు ప్రయత్నించారు. దీనిని...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

అమెరికాలో ఆగని నిరసనలు.. పోలీస్ స్టేషన్ కు నిప్పు

అమెరికాలో జాతి విద్వేషాలు రగులుకున్నాయి. మూడు రోజులుగా అమెరికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా కొందరు నిరసనకారులు మినిపోలిస్ స్టేషన్ ను ముట్టడించి నిప్పు పెట్టారు. మూడు...