Switch to English

కరోనా కథలు: దేశాధినేత ప్రాణభయం!

చావు భయం ముందట డబ్బున్నోడైనా, పేదోడైనా ఒకటే. కంటికి కనిపించని ఓ చిన్న వైరస్‌ కారణంగా ఈ రోజు ప్రపంచం విలవిల్లాడుతోంది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌.. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇదీ ఒకటి. ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఇటీవల కరోనా వైరస్‌ బారిన పడ్డ విషయం విదితమే. తాను కరోనా వైరస్‌తో బాధపడుతున్న విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఏప్రిల్‌ 5 నుంచి ఏప్రిల్‌ 12 వరకూ ఆసుపత్రిలో వైద్య చికిత్స తీసుకున్నారాయన. ఓ దశలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది కూడా. అయితే, ‘ఆయన వెంటిలేటర్‌ మీద లేరు.. ఆయన ఆరోగ్యంగానే వున్నారు..’ అంటూ యూకే ప్రభుత్వం తమ ప్రధాని విషయమై అధికారికంగా ప్రకటించింది అప్పట్లో. ఎలాగైతేనేం, ఆయన కోలుకున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బోరిస్‌ జాన్సన్‌, తాను ఆసుపత్రిలో చవిచూసిన కరోనా భయం గురించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. ‘ఆ సమయంలో లీటర్ల కొద్దీ ఆక్సిజన్‌ని ఎక్కిస్తున్నారు.. ఎవరెవరో వస్తున్నారు.. ఏమేమో చేస్తున్నారు.. నాకు అంతా అర్థమవుతోంది. నేనిక బతికే అవకాశం లేదని తెలుసుకున్నాను. మరోపక్క, నేను మరణిస్తే ఏం చేయాలన్నదానిపై సన్నాహాలు జరిగాయి..’ అని బోరిస్‌ జాన్సన్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.

సాధారణ జ్వరం లాంటిదేనని కొందరు.. అదిగో ఆ మెడిసన్‌ పనిచేసేస్తోందని ఇంకొకరు.. కరోనా వైరస్‌ తీవ్రతను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తన్నా.. కరోనా సాదా సీదా మహమ్మారి కాదనే విషయం యూకే ప్రధాని మాటల్లో స్పష్టమవుతోంది. దేశాధినేతను కాపాడుకోలేకపోతున్నామని యూకే ప్రభుత్వమే ఆవేదన చెందిందంటే.. ఆ మహమ్మారి ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోవచ్చు.

తనకు వైద్య చికిత్స అందించిన వైద్యుల పేర్లను తన కుమారుడికి బోరిస్‌ జాన్సన్‌ పెట్టడం గమనార్హం. నిజానికి, కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న బోరిస్‌ జాన్సన్‌.. ఇది తనకు పునర్జన్మ అనే భావనలో వున్నారు. చాలా విషయాల్లో తాను చాలా మారిపోయానని అంటున్నారాయన.

ప్రపంచంలో డబ్బు, అధికారం కంటే చాలా ముఖ్యమైనది ప్రాణమనీ, కరోనా బాధితుల ఆవేదన ఎంతటిదో తాను స్వయంగా చవిచూశానని చెప్పుకొచ్చారు బోరిస్‌ జాన్సన్‌. ‘కరోనా వైరస్‌కి ముందు నేను వేరు.. కరోనా వైరస్‌ తర్వాత నేను వేరు..’ అని బోరిస్‌ జాన్సన్‌ చెబుతున్నారిప్పుడు.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఏపీలో మొదటి రోజే వరుస కేసులతో చంద్రబాబుకి షాక్.!

లాక్ డౌన్ కి ముందు హైదరాబాద్ లో ఉండడంతో లాక్ డౌన్ కాలమంతా టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలోనే ఉండిపోవాల్సి వచ్చింది. దాదాపు 60 రోజుల తర్వాత ఏపీ ప్రభుత్వం...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

రంజాన్‌ ‘నైట్‌ మార్కెట్‌’కి కరోనా చీకట్లు.!

హైద్రాబాద్‌ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది బిర్యానీ.. దాంతోపాటే, రంజాన్‌ స్పెషల్‌ అయిన హలీం. ఇంకో స్పెషల్‌ కూడా వుంది రంజాన్‌ సందర్భంలో. అదే నైట్‌ బజార్‌. హైద్రాబాద్‌లోని పాత బస్తీలోగల చార్మినార్‌ ప్రాంతంలోని...

ఫ్లాష్ న్యూస్: అంపన్‌ తుఫాన్‌ అల్లకల్లోలం

బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయిన అంపన్‌ తుఫాన్‌ ఈరోజు సాయంత్రంకు తీరం దాటబోతుంది. తీరం దాటే సమయంలో పశ్చిమ బెంగాల్‌లో తీవ్రమైన పెను గాలులు వీచడంతో పాటు పెద్ద ఎత్తున వర్షపాతం నమోదు అయ్యే...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...