Switch to English

కరోనా అలర్ట్‌: శ్రీకాకుళం జిల్లాకి పాకిన కరోనా.!

రాష్ట్రమంతా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నా, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మాత్రం నిన్నటివరకూ ఈ లిస్ట్‌లో లేకపోవడం గమనార్హం. అయితే, అనూహ్యంగా శ్రీకాకుళం జిల్లాలో 3 కరోనా పాజిటివ్‌ కేసులు ఈ రోజు నమోదయ్యాయి. దాదాపు నెల రోజులపాటు ప్రశాంతంగా వున్న శ్రీకాకుళం జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. ‘ఢిల్లీ లింకులు’ వున్నాయని అధికారులు చెబతున్నా, నెల రోజులపాటు వెలుగు చూడని కేసులు, లాక్‌డౌన్‌ అమల్లో వున్నాక.. ఇప్పుడు ఎలా వెలుగు చూశాయన్నది సగటు శ్రీకాకుళం వాసుల ఆవేదనగా కన్పిస్తోంది.

కరోనా పాజిటివ్‌ వ్యక్తులతో కాంటాక్ట్‌ వున్నవారిగా భావిస్తున్న 67 మందిని అధికారులు క్వారంటైన్‌కి పంపినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో కరోనా కేసులు నమోదవడంతో, పొరుగునే వున్న విజయనగరం జిల్లాలోనూ కేసులు నమోదవుతాయేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, కొందరు రాజకీయ నాయకులే శ్రీకాకుళం జిల్లాకి కరోనా వైరస్‌ని అంటించారన్న చర్చ జిల్లా వాసుల్లో జరుగుతుండడం గమనార్హం. లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమల్లో వున్నా, కొందరు రాజకీయ నాయకులు మాత్రం యధేచ్చÛగా జిల్లాల మధ్య చక్కర్లు కొట్టేస్తున్నారనీ, వారి అనుచరులూ ‘అధికారం తమదే’ అన్న అత్యుత్సాహం ప్రదర్శించడమే ఈ పరిస్థితి కారణమన్న చర్చ జిల్లాలో విన్పిస్తోంది.

రాజకీయ నాయకుల ఓవరాక్షన్‌ కారణంగా కృష్ణా, గుంటూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పరిస్థితులు చెయ్యిదాటిపోయిన విషయం విదితమే. అయితే, ప్రభుత్వం మాత్రం.. కరోనాని రాజకీయ కోణంలోగానీ, మత కోణంలోగానీ చూడటం తగదని చెబుతోంది. ఏదిఏమైనా, ప్రభుత్వం లాక్‌డౌన్‌ విషయంలో మరింత పకడ్బందీ చర్యలు చేపట్టాల్సి వుందన్నది నిర్వివాదాంశం. ఇదిలా వుంటే, రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 61 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దాంతో, కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మొత్తంగా 1016కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వెయ్యి మార్క్‌ దాటిన చెత్త ఘనత ఆంధ్రప్రదేశ్‌ మూటగట్టుకోవడం బాధాకరం.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

ఇన్‌సైడ్‌ స్టోరీ: తెలంగాణలో కరోనా టెస్టులు పెరగాల్సిందే.!

దేశంలోని ప్రముఖ నగరాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వాటన్నిటితో పోల్చి చూస్తే, హైద్రాబాద్‌ పరిస్థితి కాస్త బెటర్‌. తెలంగాణలో గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలోనే ఎక్కువగా కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. మిగతా...

వద్దన్నా వినడంలేదు.. మళ్లీ అవే రంగులు

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయొద్దంటూ ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి హైకోర్టులో ఇప్పటికే పలుమార్లు ఎదురుదెబ్బలు తగిలాయి. తొలుత ఆ రంగులు మార్చాలంటూ హైకోర్టు ఆదేశించగా.. వాటికి మట్టి రంగును...

ఈసారి సూర్య ఆ పని చెయ్యట్లేదు.!

తెలుగులో ఫాలోయింగ్ సంపాదించుకున్న కొంత మంది తమిళ హీరోల్లో సూర్య కూడా ఒకరు. ఒక రకంగా చెప్పాలంటే తమిళంతో పాటు తెలుగులో కూడా అదే రేంజ్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. తమిళంలో సినిమా...

బన్నీ కోసం మారుతి కథ రెడీ అయిపోయిందా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు, సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతికి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఇద్దరూ చాలా క్లోజ్. ఇటీవలే మారుతి మాట్లాడుతూ తామిద్దరం వాట్సాప్ లో తరచూ టచ్...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...