Switch to English

కరోనా మీటర్‌: నరేంద్ర మోడీ గ్రాఫ్‌ పెరిగిందా? తగ్గిందా.?

రాజకీయాల గురించి మాట్లాడుకునే సమయమా ఇది.? అని అధికారంలో వున్న రాజకీయ పార్టీలు ప్రశ్నించొచ్చుగాక. కానీ, ఆ అధికార పార్టీలే ఇప్పుడు చిత్ర విచిత్రమైన రాజకీయాలు చేస్తున్నాయి.! అదే రాజjకీయం అంటే. ‘నేను చేస్తే శృంగారం.. ఇంకెవడన్నా చేస్తే వ్యభిచారం..’ అన్నట్టు రాజకీయ పార్టీలు వ్యవహరించడం మామూలే.

అసలు విషయానికొస్తే, నెలన్నరగా దేశంలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. దేశమంతా లాక్‌డౌన్‌లో వుంది. ఈ క్రమంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంతవరకు ప్రజల మనసుల్ని గెల్చుకుంది.? అన్న విషయమై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జన్‌ధన్‌ ఖాతాల్లో డబ్బులు వేయడం.. పేదలకు రేషన్‌ అందించడం సహా.. పలు కీలక చర్యల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నా, రాష్ట్రాలూ తమవంతుగా ప్రజల్ని ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితులు మాత్రం అత్యంత భయానకంగా వున్నాయన్నది నిర్వివాదాంశం.

ఓ వ్యక్తి 1500 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి, చివరికి గమ్యస్థానం చేరకుండానే ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి వార్తలు ఇటీవలి కాలంలో చాలానే చూశాం. ఆకలి చావుల సంగతి సరే సరి.! ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణాలకు పాల్పడుతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటిదాకా ఓ లెక్క.. ఇకపై ఇంకో లెక్క. లాక్‌డౌన్‌ ముగిశాక అసలు సిసలు నష్టం ఏంటో తెలుస్తుంది.. అని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్న వేళ, నరేంద్ర మోడీ పాలనకు సంబంధించి కరోనా మీటర్‌ రీడింగ్‌ ఏం చెబుతోంది.? అన్న చర్చ సర్వత్రా జరగడం సహజమే.

లాక్‌డౌన్‌ అంటే చెప్పాపెట్టకుండా వచ్చేసిందిగానీ.. కరోనా వైరస్‌ అలా కాదు. ముందుగా చైనాని ముంచేసింది.. అప్పుడే ప్రపంచదేశాలు అలర్ట్‌ అయి వుండాలి. మన దేశంలో పరిస్థితి అందుకు భిన్నం. ‘మూడు నాలుగు రోజుల తర్వాత ఎందుకు.? ఇప్పుడే అంతర్జాతీయ విమానాల రాకపోకలు ఆపేయొచ్చు కదా..’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో కేంద్రాన్ని ప్రశ్నించిన విషయం విదితమే. అప్పటికి దేశంలో వున్న పరిస్థితి కేసీఆర్‌ మాటల్లో సుస్పష్టమయ్యింది. కానీ, ‘కూడికలూ.. తీసివేతలూ..’ చాలానే లెక్కేసుకుని.. తాపీగా అంతర్జాతీయ విమాన రాకపోకల్ని కేంద్రం ఆపింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

తబ్లిగీ జమాత్‌ లెక్క కారణంగా దేశంలో కేసులు అనూహ్యంగా పెరిగాయన్నది ఇంకో కీలకమైన అంశం. అంతలా జనం ఒకే చోట మత కార్యక్రమాల కోసం పోగైతే.. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు.? అదీ కరోనా వైరస్‌ అప్పటికే ప్రపంచాన్ని చుట్టేస్తున్న సందర్భం. ఇలా ఏ కోణంలో చూసుకున్నా మోడీ సర్కార్‌ ఫెయిల్యూర్‌ సుస్పష్టం. ఎవరన్నా ప్రశ్నిస్తే, ఎదురుదాడికి దిగడం బీజేపీ నేతలకు అలవాటైపోయిందిగానీ.. మోడీ సర్కార్‌ వైఫల్యానికి దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందన్నది నిర్వివాదాంశం.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

బ్రేకింగ్ న్యూస్: 12 గంటల్లో ఢిల్లీలో రెండు భారీ అగ్ని ప్రమాదాలు.!

సోమవారం అర్ధరాత్రి 12 గంటల 50 నిమిషాలకి ఢిల్లీలోని తుగ్లకాబాద్‌ మురికివాడలో మంటలు చెలరేగాయి.ఈ మంటలు సుమారు రెండు ఎకరాల మేర వ్యాపించడంతో అక్కడున్న దాదాపు 1500 గుడిసెలు ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదం...

వైసీపీ పైత్యం: హైకోర్టుకీ దురుద్దేశాలు ఆపాదిస్తారా.?

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గడచిన ఏడాది కాలంలో 60 సార్లకు పైగా న్యాయస్థానాల నుంచి మొట్టికాయలేయించుకోవడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పరిపాలన అన్నాక ఇలాంటివి సహజమే. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు న్యాయస్థానాలు చీవాట్లు...

ఫ్లాష్ న్యూస్: ఫుట్‌ బాల్‌ స్టేడియంలో ప్రేక్షకులకు బదులు బూతు బొమ్మలు

ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా అన్ని రంగాలను విభాగాలను ప్రభావితం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో జరగాల్సిన ఆటలను కూడా కరోనా కారణంగా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నో అంతర్జాతీయ టోర్నీలు కూడా...

యంగ్ హీరో కెరీర్ కు ఈ సినిమా చాలా కీలకం

ఏ సపోర్ట్ లేకుండా తన ప్రతిభతో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాజ్ తరుణ్. కెరీర్ మొదట్లో సూపర్ హిట్లు సాధించిన ఈ కుర్రాడు సరైన సినిమాల ఎంపికలో...

ఫ్లాష్ న్యూస్: రోడ్డు మీద మిలియన్‌ డాలర్ల డబ్బు దొరికితే అతడేం చేశాడో తెలుసా?

రోడ్డు మీద పది రూపాయలు దొరికితే అటు ఇటు చూసి దాన్ని జేబులో పెట్టుకునే రోజులు. వేల రూపాయలతో ఉన్న పర్స్‌ రోడ్డు మీద కనిపిస్తే ఎవరిదో అనే విషయం కనీసం ఆలోచించకుండా...