Switch to English

కోలుకుంటున్న జనం.. కోరలు చాస్తున్న కరోనా

జనసాంద్రత ఎక్కువగా వున్న భారతదేశంలో కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) వ్యాప్తిని అడ్డుకోవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్ష దాటేసినా.. ప్రపంచంలోని చాలా దేశాలతో పోల్చితే మన దేశంలో లాక్‌డౌన్‌ కారణంగా మెరుగైన పరిస్థితే వుందని పలు సర్వేలు, నివేదికలు చెబుతున్నాయి. నిజానికి, అసలు సమస్య ఇప్పుడే మొదలవుతోంది. కేసుల సంఖ్య రోజు రోజుకీ మరింత పెరుగుతోంది. నిన్న దేశంలో 5600 కొత్త కేసులు నమోదయ్యాయి.

మరోపక్క, క్రమక్రమంగా సగటు భారతీయుడు ఊపిరి పీల్చుకుంటున్నాడు. ఇప్పుడిప్పుడే రకరకాల పనుల నిమిత్తం కాస్త స్వేచ్ఛగా బయటకొస్తున్నాడు చాలా రోజుల తర్వాత. లాక్‌డౌన్‌ ఇంకా అమల్లో వున్నప్పటికీ, కేంద్రం కల్పించిన వెసులుబాట్లు.. రాష్ట్రాలు ఇస్తున్న వెసులుబాట్లతో జనజీవనం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. అయితే, ఇంకా సొంతూళ్ళకు వలసదారులు పోటెత్తడం మాత్రం ఆగడంలేదు. అది ఇప్పట్లో ఆగేలా కన్పించడంలేదు కూడా.

‘ఏదీ మునుపటిలా వుండదు..’ అని చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. అది నిజం కూడా. బయట తిరుగుతున్నా, పక్కన వెళుతున్నవారిని అనుమానంతో చూడాల్సి రావడం ఎవరికైనా అత్యంత బాధాకరమైన విషయం. కానీ, తప్పదు. కరోనా వైరస్‌ అలాంటిది మరి. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు లక్ష దాటేశాయ్‌.. అనేదొక్కటే కాదు.. కోలుకుంటున్నవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందన్న విషయాన్నీ గుర్తుంచుకోవాలి. మరణాల శాతం తక్కువగానే వున్నప్పటికీ, మనదేశంలో ఆ ‘శాతం’ అనేది అత్యంత కీలకం. దేశంలో ఏ ఒక్కరినీ కరోనా వదిలిపెట్టే అవకాశం లేదంటూ నిపుణులు హెచ్చరిస్తున్న వేళ 3 శాతం మరణాలు అంటే భారతదేశంలో చిన్న విషయం అని ఎలా అనుకోగలం.?

135 కోట్ల మంది జనాభా వున్న భారతదేశంలో కరోనా వైరస్‌ మొత్తంగా వ్యాప్తి చెందితే.. ఆ పరిస్థితిని అస్సలేమాత్రం ఊహించలేం. వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ వస్తే.. మరణాలకు ఫుల్‌స్టాప్‌ పడుతుంది. ఈలోగా వ్యక్తిగత పరిశుభ్రత, ఫిజికల్‌ డిస్టెన్స్‌ తప్పనిసరి. లాక్‌డౌన్‌ సడలింపులతో జనం కోలుకుంటుండడం ఆహ్వానించదగ్గ పరిణామమే. కూలీ నుంచి కార్పొరేట్‌ ఉద్యోగిదాకా.. అందరికీ ఇది ఉపశమనమే. కానీ, భయం భయంగా ఎన్నాళ్ళు ఈ జీవితం.? అన్నదే అందరి మదిలో మెదులుతున్న ఆవేదన.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

లాక్‌డౌన్‌ ఆత్మహత్యల లెక్కెంత?

కరోనా వైరస్‌ కారణంగా దేశంలో మృతి చెందినవారి సంఖ్య 3 వేలు దాటింది. మరోపక్క, లాక్‌డౌన్‌ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య కూడా క్రమక్రమంగా పెరిగిపోతోంది. రోడ్డు ప్రమాదాలు, ఆకలి చావులు.. ఇలా...

షాకింగ్: వలస కూలీ ఆకలి కేక.. చచ్చిన కుక్కను తింటూ.!

దేశంలో కరోనా వైరస్ కంటే వలస కూలీల కష్టాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు పయనమవుతున్నారు. ట్రాన్స్ పోర్ట్ లేక ఎంతోమంది కాలిబాటన వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామలకు...

గడిపింది బాయ్ ఫ్రెండ్ తో.. గర్భానికి కారణమని డెలివరీ బాయ్ పై కేసు

ఇదో విచిత్రమైన కేసు. చైనాకు చెందిన ఓ ముద్దుగుమ్మ తన బాయ్ ఫ్రెండ్ తో ఏకాంతంగా గడిపింది. ఫలితంగా గర్భం దాల్చింది. అయితే, అందుకు కారణం డెలివరీ బాయ్ అని, అతడు ఎనిమిది...

అటు జగన్, ఇటు చంద్రబాబు ఇరకాటంలో పడ్డట్టేనా?

లాక్ డౌన్-4 మార్గదర్శకాలను ప్రకటించడానికి తెలంగాణ సీఎం మీడియాతో మాట్లాడటానికి వస్తున్నారనగానే.. పోతిరెడ్డిపాడు వ్యవహారంపై ఏం మాట్లాడతారన్నదానిపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఈ వివాదంపై ఎక్కువ స్పందించనంటూనే చాలా...

ఫ్లాష్ న్యూస్: కరోనాతో కానిస్టేబుల్ మృతి.. పోలిస్ శాఖలో కలకలం

తెలంగాణ పోలీస్ శాఖలో పని చేస్తున్న కానిస్టేబుల్ కు కరోనా వైరస్ సోకి మరణించడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని కుల్సుంపురా పీఎస్ లో దయాకర్ రెడ్డి (37) కానిస్టేబుల్ గా పని...