Switch to English

కరోనా ఎఫెక్ట్: పత్రికల పరిస్థితేంటి?

తెలుగు రాష్ట్రాల్లో చాలామంది సీనియర్ సిటిజన్లకు ఉదయాన్నే కాఫీ లేకపోయినా పర్వాలేదు కానీ చేతిలో వార్తాపత్రిక లేకపోతే మాత్రం ఏదో కోల్పోయిన ఫీలింగ్ తో ఉంటారు. ఏడాదిలో మూడు రోజులు మాత్రమే ప్రెస్ హాలీడే కారణంగా పత్రిక రాదు.. అయినా ఆ రోజుల్లో కూడా వారు ఏదో తెలియని వెలితితో కనిపిస్తారు. అలాంటిది కరోనా మహమ్మారి కారణంగా గత రెండు వారాలుగా పేపర్ రావడంలేదు. మీడియా సంస్థలు పత్రికను యథావిధిగా ప్రింట్ చేస్తున్నా హాకర్లు పంపిణీ చేయడంలేదు. దీంతో జనం పరిస్థితులకు అలవాటుపడుతున్నారు.

అయితే, కరోనా అదుపులోకి వచ్చిన తర్వాత పత్రికల పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై పలువురికి ఆందోళన నెలకొంది. నిజానికి నేటి యువతరం పత్రికలను అంతగా పట్టించుకోదు. వారికి స్మార్ట్ ఫోన్ ఒక్కటుంటే చాలు. ఇక పత్రికలను చదివేది రాజకీయ నాయకులు, వివిధ సంఘాల నేతలు, ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు మాత్రమే. ప్రస్తుతం పత్రిక ఇంటికి రాని తరుణంలో వీరు కూడా ఈపేపర్ చదవడానికి అలవాటు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో కరోనా సంక్షోభం ముగిసి పత్రికలు మళ్లీ ఇంటికి రావడం మొదలైన తర్వాత మునుపటిలాగే వాటిని ఆదరిస్తారా లేక ఇంకా కరోనా అనుమానాలతో కాలం వెళ్లదీస్తారా అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి పత్రికలతో కరోనా వ్యాపించదని, పైగా తమ పత్రికను శానిటైజేషన్ చేసి మరీ ఇస్తున్నామని పెద్ద పత్రికలు ఘోషిస్తున్నా.. జనంలో మాత్రం అనుమానాలు పోవడంలేదు.

ఇప్పటికే యాడ్ రెవెన్యూ లేకపోవడంతో తీవ్ర ఒడిదొడుకులకు గురైన పత్రికారంగం.. పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. పేజీల సంఖ్యను కుదించేసింది. టాబ్లాయిడ్ తీసేసి వాటిని కూడా మెయిన్ లో కలిపేసింది. ఇక ఆదివారం మేగజైన్ కూడా తీసేసింది. తద్వారా ప్రింటింగ్ వ్యయాన్ని తగ్గించుకుంది.

ఇక సిబ్బంది కుదింపుపై యాజమాన్యాలు దృష్టి పెట్టినట్టు సమాచారం. 30 శాతం నుంచి 50 శాతం మందిని తొలగించే దిశగా ప్రధాన పత్రికలు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు కూడా మొదలుపెట్టారని చెబుతున్నారు. మరోవైపు లాక్ డౌన్ మరికొంత కాలం కొనసాగిన పక్షంలో ముద్రణకు అవసరమైన పేపర్ కు తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉంది. దీంతో పత్రిక ప్రింట్ అయ్యే పరిస్థితి ఉండదు.

సాధారణంగా మనదేశంలోని పెద్ద పత్రికలు యూరప్ నుంచి ముడి కాగితాన్ని దిగుమతి చేసుకుంటాయి. రెండు మూడు నెలలకు అవసరమైన పేపర్ ను ఒకసారి కొనుగోలు చేస్తుంటాయి. లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం అంతర్జాతీయ సరిహద్దులు మూసివేసి ఉండటం.. అవి ఎప్పుడు తెరుచుకుంటాయో ఇంకా క్లారిటీ లేకపోవడంతో ఇప్పట్లో పేపర్ దిగుమతి అయ్యే అవకాశాలు లేవు. ఇది పత్రిక ముద్రణపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

దారుణం: వలస కూలీల బస్సు బోల్తా – 33మందికి గాయాలు.!

ఈ కరోనా వైరస్ తెచ్చిన లాక్ డౌన్ వలన అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంది మాత్రం వలస కూలీలే అని చెప్పాలి. ఉన్న చోట తిండి లేక కొందరు, కాలినడకన కొందరు, మార్గ...

ఫ్లాష్ న్యూస్: 91 మందికి కరోనా అంటించిన బార్బర్

ప్రపంచంలో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు రెండు నెలల తర్వాత అమెరికాలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి అనుకుంటున్న సమయంలో...

క్రైమ్ న్యూస్: మృత్యుబావి మర్డర్ మిస్టరీ – స్లీపింగ్స్ పిల్స్ తో 9 హత్యలు.!

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో బావిలో బయటపడిన 9 మృతదేహాల ఉదంతం గత కొద్ది రోజులుగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన ఈ మృతదేహాల పోస్ట్...

టీడీపీకి ఎన్టీఆరే దిక్కు.. కండిషన్స్‌ అప్లయ్‌.!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన తాత స్వర్గీయ నందమూరి తారకరామారావు తరహాలోనే ఖాకీ రంగు దుస్తులు ధరించి, రాజకీయ తెరపై కన్పించాల్సిందేనా.? ఆ సమయం ఆసన్నమయ్యిందా.? అంటే, అవుననే అంటున్నారు టీడీపీలో చాలామంది...

గుడ్ న్యూస్: జూన్ నుంచి షూటింగ్స్ కి గ్రీన్ సిగ్నల్.!

నిన్ననే(మే 21న) సినిమాటోగ్రఫీ మినిస్టర్ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులంతా కలిసి సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభించాలి, అలాగే థియేటర్స్ పరిస్థితిపై...