Switch to English

రంజాన్‌పై కరోనా ఎఫెక్ట్‌: నష్టం కోట్లలోనే.!

రంజాన్‌ సీజన్‌ వచ్చిందంటే ఆ సందడే వేరు. నెల రోజులపాటు పండగ వాతావరణం కన్పిస్తుంటుంది. కరోనా వైరస్‌ దెబ్బకి రంజాన్‌ ఈసారి వెలవెలబోతోంది. ఇది హైద్రాబాద్‌ పరిస్థితి మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా.. ఆ మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. హైద్రాబాద్‌ విషయానికొస్తే రంజాన్‌ కోసం దేశంలోని వివిద ప్రాంతాల నుంచి పెద్దయెత్తున కార్మికులు తరలి వస్తుంటారు. విదేశాల నుంచి కూడా బిర్యానీ, హలీం తయారీలో నిపుణులైన వంటవాళ్ళు రావడం జరుగుతుంటుంది.

బిర్యానీ, హలీం మాత్రమే కాదు.. రంజాన్‌ అంటే చాలా వంటకాలకు స్పెషల్‌. రంజాన్‌ పర్వదినం (ఈద్‌ అల్‌ ఫితర్‌) రోజున వంటకాలు మరీ ప్రత్యేకం. సేమ్యా సహా అనేక ప్రత్యేక వంటకాల తయారీ కోసం కొన్ని నెలల ముందు నుంచే ఏర్పాట్లు జరుగుతాయి. ఈసారీ ఏర్పాట్లు ముందుగానే జరిగాయి. అవసరమైన ముడిపదార్థాలూ దిగుమతి అయ్యాయి. ఇంతలోనే కరోనా వైరస్‌ వచ్చి పడింది. దాంతో, కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది వ్యాపారులకి.

లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు రావడంతో వ్యాపారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే, ఇక్కడే అసలు సమస్య మొదలైంది. కార్మికులు ప్రస్తుతం అందుబాటులో లేరు. దాంతో, సేమ్యా తయారీకి ముడి సరుకులు వున్నా.. అది తయారయ్యే పరిస్థితి లేదు. ఇక, నాన్‌ వెజ్‌ విషయానికొస్తే.. దీని వినియోగం కూడా గతంతో పోల్చితే ఇప్పుడు బాగా తగ్గినట్లే కన్పిస్తోంది. సడలింపులు వచ్చాక కూడా పరిస్థితుల్లో పెద్దగా మార్పు కన్పించడంలేదని వ్యాపారులు అంటున్నారు.

కరోనా వైరస్‌ దెబ్బకి ఆర్థికంగా చితికిపోయిన సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు.. ఈసారి రంజాన్‌ని సాదా సీదాగా మాత్రమే కానిచ్చేయక తప్పేలా లేదనీ, దాంతో వస్త్ర దుకాణాలు తెరిచినా, గిరాకీ సరిగ్గా లేదని వ్యాపారులు అంటున్నారు. ఎలా చూసినా, ఒక్క హైద్రాబాద్‌లోనే వందల కోట్ల వ్యాపారం ఈసారి లేకుండా పోయిందనే చర్చ సర్వత్రా జరుగుతోంది. వ్యాపారం కోసమే కాదు.. రంజాన్‌ సందర్భంగా పర్యాటకం కోణంలోనూ రంజాన్‌ ఎంతో ప్రత్యేకమైనది. దురదృష్టవశాత్తూ ఈ ఏడాది రంజాన్‌ హైద్రాబాదీలకే కాదు.. ఈ సీజన్‌లో హైద్రాబాద్‌ని సందర్శించాలనుకునేవాళ్ళకీ ‘కిక్కు’ ఇవ్వలేకపోయింది.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: మాస్కుల్లో ఈ మాస్క్ వేరయా..

లాక్ డౌన్ ఆంక్షలు కొద్దిగా తొలగడంలో ప్రజలంతా బయటకి వస్తున్నారు. కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. మాస్క్ లు, శానిటైజర్లు వాడుతున్నారు. కానీ.. మాస్క్ లేకుండా ఎవరూ రావటం లేదు....

ఆగస్టులో వచ్చే సినిమాలు ఏంటి?

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్స్‌కు అనుమతిస్తూ మెల్ల మెల్లగా లాక్‌ డౌన్‌ను సఢలిస్తున్న విషయం తెల్సిందే. ఆగస్టు నుండి పూర్తి స్థాయిలో థియేటర్లు ఓపెన్‌ అయ్యే అవకాశం ఉందని.. అయితే సామాజిక దూరం...

కేజీఎఫ్‌ విషయంలో అంత పట్టుదల ఎందుకు?

కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ప్రపంచంలో పలు దేశాలు లాక్‌ డౌన్‌ అమలు చేశాయి. ఇండియాలో రెండు నెలల పాటు లాక్‌ డౌన్‌ కొనసాగింది. ఇంకా కూడా లాక్‌ డౌన్‌లోనే ఇండియా ఉంది....

తెలంగాణతో ‘నీటి పంచాయితీ’: ఏపీ వాదనలో ‘పస’ ఎంత.?

తెలంగాణ ప్రభుత్వం రికార్డ్‌ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుని పూర్తి చేసింది. నిజానికి అత్యంత క్లిష్టతరమైన ప్రాజెక్టు ఇది. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాలు ఇప్పుడు జల కళను సంతరించుకున్నాయంటే కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమే....

బాలయ్య – బోయపాటి.. ఓ సస్పెన్స్ డ్రామా

నందమూరి బాలకృష్ణ - సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనులది స్పెషల్ కాంబినేషన్. వీరిద్దరూ మొదట కలిసి చేసిన సింహా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత కొన్నేళ్ళకు మళ్ళీ ఇద్దరూ...