దేశంలో కరోనా తీవ్రత హెచ్చుతగ్గులతోనే కొనసాగుతోంది. అయితే.. రోజువారీ కేసుల్లో తగ్గుదల కనిపించింది. నిన్న 2వేలకు దిగువనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం..
గడచిన 24 గంటల్లో దేశంలో 4.34 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1829 కేసులు నమోదయ్యాయి. వరుసగా రెండో రోజూ 2వేలకు దిగువనే కేసులు నమోదయ్యాయి. మొత్తంగా దేశంలో 4.31కోట్ల మంది వైరస్ బారిన పడ్డారు. 4.25 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.75 శాతానికి చేరింది. నిన్న కరోనాతో దేశంలో 33 మంది మృతి చెందారు. మొత్తంగా కరోనాతో 5.23 లక్షల మంది మృతి చెందారు.
నిన్న దేశవ్యాప్తంగా కరోనా నుంచి 2549 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 15,647గా ఉన్నాయి. నిన్న 14.97 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. మొత్తంగా దేశంలో 191 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి.