ఏపీలో గడచిన 24 గంటల్లో 13,474 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కడప జిల్లాలో 2031 కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనాతో మృతి చెందారు. 10,290 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,09,493 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తెలంగాణలో కొత్తగా 3944 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 1372 మందికి కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 39,520 గా ఉంది. నిన్న ఒక్కరోజే 2444 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
మరోవైపు దేశంలో కూడా కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం 77 శాతం కేసులు 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయని.. 11 రాష్ట్రాల్లో 50వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. కర్ణాటక, మహఆరాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో 3 లక్షలకు పైగా ఉండగా.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో లక్షకు పైగా కేసులు ఉన్నాయని తెలిపింది.