Switch to English

బోర్డర్‌ టెన్షన్‌: జగన్‌ అలా విజయసాయిరెడ్డి ఇలా.!

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చెప్పింది వినాలా.? వైసీపీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పింది నిజమనుకోవాలా.? కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం విదితమే. ఎక్కడివాళ్ళు అక్కడే వుండిపోయారు ఇప్పటిదాకా.! కానీ, కేంద్రం కల్పించిన తాజా వెసులుబాట్లతో రాష్ట్రాల మధ్య రాకపోకలు లేకపోయినా.. ప్రత్యేక పరిస్థితుల్లో ఇట్నుంచి, అటు.. అట్నుంచి ఇటు రావడానికి కాస్త వీలు కలిగింది.

గుజరాత్‌ నుంచి మత్సకారులు ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కి చేరుకున్న వైనంపై అధికార వైసీపీ చేసిన పబ్లిసిటీ స్టంట్లు చూశాం. వాళ్ళంతా లాక్ డౌన్ నేపథ్యంలో గుజరాత్ లోనే నిన్న మొన్నటిదాకా ఇరుక్కుపోయారు. ‘ఇటలీ నుంచి వచ్చారు.. గుజరాత్‌ నుంచీ వచ్చారు.. హైద్రాబాద్‌ నుంచి చంద్రబాబు, లోకేష్‌ మాత్రం రావడంలేదు..’ అంటూ విజయసాయిరెడ్డి సోషల్‌ మీడియా వేదికగా సెటైర్‌ వేశారు.

ఇంతలోనే, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, ‘ఎక్కడివారు అక్కడే వుండండి..’ అంటూ ‘బోర్డర్‌’ దాటి వస్తోన్న పొరుగు రాష్ట్రాలకు చెందినవారిని (మరీ ముఖ్యంగా తెలంగాణ నుంచి వచ్చేవారిని) ఉద్దేశించి విజ్ఞప్తి చేయడం గమనార్హం. ‘రాకపోకలు పెరిగితే, కరోనా వ్యాప్తిని అరికట్టలేం..’ అన్నది వైఎస్‌ జగన్‌ ఆలోచన. అది నిజం కూడా.

అయితే, కేంద్రం ఇచ్చిన వెసులుబాట్లతో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ నుంచి ఏపీకి వెళ్ళేవారి కోసం ప్రత్యేకంగా పాసుల్ని మంజూరు చేసింది. ఈ పాసులు పట్టుకుని, తెలంగాణలో ఇప్పటిదాకా చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రజలు, తమ సొంతూళ్ళకు వెళ్ళేందుకు ప్రయత్నించారు. అయితే, వారిని బోర్డర్‌లోనే అడ్డుకున్నారు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు. ‘తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పాసులతో మాకు సంబంధం లేదు..’ అని ఆంధ్రప్రదేశ్‌కి చెందిన అధికారులు చెబుతుండడం గమనార్హం. దాంతో, మళ్ళీ తెలంగాణ ` ఆంధ్రప్రదేశ్‌ బోర్డర్ల మధ్య టెన్షన్‌ వాతావరణం నెలకొంటోంది.

గతంలో కూడా ఇదే తరహా పరిస్థితులు తలెత్తాయి. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించాయి.. ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చు జరిగాక, పరిస్థితి కాస్త సద్దుమణిగింది. మరి, ఈసారి ఏమవుతుంది.? విజయసాయిరెడ్డి గొప్పలు జనాల కొంపలు ముంచేస్తున్నాయనుకోవాలా.? ప్రభుత్వంతో సంప్రదించకుండా విజయసాయిరెడ్డి ఓవరాక్షన్‌ చేస్తున్నా, ముఖ్యమంత్రి ఆయన్నెందుకు ఉపేక్షిస్తున్నట్లు.?

సినిమా

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.?...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఆరడుగులు సరిపోదంట..!

కరోనా మహమ్మారిని ఇప్పట్లో తరిమికొట్టడం సాధ్యం కాదని, దానితో కలిసి బతకడం అలవాటు చేసుకోవాల్సిందేనంటూ నేతల దగ్గర నుంచి న్యాయస్థానాల వరకు తేల్చి చెప్పేశాయి. ఎవరికి వారు తీసుకునే జాగ్రత్తలు వారికి రక్షణ...

ఫ్లాష్ న్యూస్: లైవ్ ఇంటర్వ్యూలో భూకంపానికి బెదరని ప్రధాని.!

మనం మాట్లాడుతున్నప్పడు ఏదైనా శబ్దం వస్తేనే విసుగనిపిస్తుంది.. భారీ శబ్దమైతే ఉలిక్కిపాటుకు గురవుతాం. కానీ.. ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోను అని నిరూపిస్తున్నారు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్. వెల్లింగ్టన్ లో స్థానికంగా ఓ...

బిగ్ బాస్ స్టార్ తండ్రి ఒక రేపిస్ట్

హిందీ బిగ్ బాస్ 13వ సీజన్ లో అందరి దృష్టిని ఆకర్షించింది నటి, సింగర్, మోడల్ షెహనాజ్ గిల్ మళ్ళీ వార్తల్లో నిలిచింది. బిగ్ బాస్ వల్ల మరింత క్రేజ్ దక్కించుకున్న షెహనాజ్...

వైసీపీ పైత్యం: హైకోర్టుకీ దురుద్దేశాలు ఆపాదిస్తారా.?

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గడచిన ఏడాది కాలంలో 60 సార్లకు పైగా న్యాయస్థానాల నుంచి మొట్టికాయలేయించుకోవడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పరిపాలన అన్నాక ఇలాంటివి సహజమే. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు న్యాయస్థానాలు చీవాట్లు...

క్రైమ్ న్యూస్: మృతదేహాల పోస్టుమార్టంలో కీలక సమాచారం లభ్యం.!

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో జరిగిన ఆత్మహత్యల ఉదంతం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. బావిలో బయటపడిన 9 మృతదేహాలు ఒకే కుటుంబానికి చెందినవి కావడంతో మరింత ప్రకంపనలు రేపింది....