Switch to English

కరోనా అలర్ట్‌: చేతులెత్తేసిన వైఎస్‌ జగన్‌ సర్కార్‌.!

‘జ్వరం వస్తుంది.. మందులేసుకుంటే పోతుంది..’ అంటూ కరోనా వైరస్‌ గురించి ముఖ్యమంత్రి చాలా లైట్‌ తీసుకున్నారు. నిజానికి ఇది మొదటి సారి కాదు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నుంచి ఈ తరహా వ్యాఖ్యలు రావడం. మొదటి నుంచీ వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, కరోనా వైరస్‌ విషయంలో ఒకే మాట మీద వున్నారు. అయితే, కరోనా వైరస్‌ సాధారణ జ్వరం కాదు. ప్రపంచాన్ని వణికిస్తోన్న వైరస్‌.

సాధారణ జ్వరం పెద్ద సమస్య కానే కాదు.. మరి అలాంటప్పుడు, రోజూ వేల కొద్దీ కరోనా వైరస్‌ పరీక్షలు ఎందుకు చేయిస్తున్నట్లు.? కరోనా వైరస్‌ పరీక్షల విషయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామంటూ ‘సెల్ఫ్ డబ్బా’ కొట్టుకోవడమెందుకు.? పరీక్షలు ఎక్కువగా జరుగుతున్నందుకు సంతోషించాల్సిందే. కానీ, ‘ఎక్కువ పరీక్షలు చేస్తున్నాం.. ఆ పరీక్షలతో పోల్చితే నమోదువుతన్న కేసుల సంఖ్య తక్కువే..’ అని ప్రజలకు తప్పుడు సమాచారం ఎలా చెబుతారు.?

శ్రీకాకుళం జిల్లాలో ఓ యువకుడికి కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ అని తేలింది.. కానీ, కొద్ది రోజుల తర్వాత ఆ యువకుడి కుటుంబ సభ్యులకి కరోనా వైరస్‌ సోకింది.. అదీ ఆ యువకుడి ద్వారానే. మరి, కరోనా వైరస్‌ పరీక్షలతో నూటికి నూరు శాతం ‘వాస్తవాలు’ బయటకు వస్తున్నాయని ఎలా అనుకోగలం.? కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల్లో ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే తెలంగాణను దాటేసింది. తమిళనాడుని దాటేయడానికి శరవేగంగా పరుగులు పెడ్తోంది.

దేశంలో ప్రస్తుతానికి కరోనా పాజిటివ్‌ కేసుల పరంగా నెంబర్‌ వన్‌ పొజిషన్‌లో మహారాష్ట్ర వుంది. రికార్డుల కోసం ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రతో పోటీ పడాలనుకుంటోందా.? అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. విపక్షాలపై విమర్శలు చేయడం మానేసి, విపక్షాల నుంచి వచ్చే సూచనల్ని ప్రభుత్వం స్వీకరిస్తే.. తమ ‘అనుభవ రాహిత్యం’ కొంత మేర మరుగున పడ్తుందన్న విజ్ఞత కూడా అధికార పక్షానికి లేకపోవడం ఆశ్చర్యకరం.

గత కొద్ది రోజులుగా వైసీపీ మంత్రులు, మీడియా ముందుకొచ్చిన ప్రతిసారీ విపక్షాల్ని విమర్శించేందుకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు.. ఆ సమయం కరోనా వైరస్‌ వ్యాప్తిని తగ్గించేందుకు వెచ్చిస్తే.. కొంతైనా రాష్ట్రం కుదురుకుంటుంది.. రాష్ట్ర ప్రజలకూ మేలు జరుగుతుంది.

కరోనా వైరస్‌ విషయంలో నిన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యలు చూస్తోంటే, పూర్తిగా ప్రభుత్వం చేతులెత్తేసినట్లే కన్పిస్తోంది. ఓ పక్క మేం సాధించేశాం.. మేం సమర్థవంతంగా పనిచేస్తున్నాం.. మేం వైఎరస్‌ని ఎదుర్కొంటున్నాం.. అని చెబుతూనే, ఇంకోపక్క కరోనా వైరస్‌ని అరికట్టలేం.. ఓ ఏడాదిపాటు ఆ కరోనా వైరస్‌ మనతోనే వుంటుంది తప్పదు.. అని ప్రభుత్వం చేతులెత్తేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

బీహార్ బాలిక సాహసానికి ఇవాంకా ఫిదా.!

ప్రమాదానికి గురై నడవలేని స్థితిలో ఉన్న తండ్రిని సైకిల్ పై కూర్చోబెట్టుకుని ఏకంగా 1200 కిలోమీటర్లు ప్రయాణించిన 15 ఏళ్ల బీహార్ బాలికపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్...

ఫ్లాష్ న్యూస్: ఇంట్లోకి పాములు వస్తున్నాయని ఊరు వదిలి పెట్టారట

కంప్యూటర్ కాలంలో కూడా కొందరు మూఢ నమ్మకాలు పాటిస్తూ, వాటిని నమ్ముతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ భీందు జిల్లాలో జరిగిన సంఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంట్లో దాదాపుగా 120...

చంద్రన్న ఛలో అమరావతి.. పార్టీ శ్రేణుల్లో ఏదీ ఆ ఉత్సాహం.?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దాదాపు రెండు నెలల విరామం తర్వాత అమరావతికి రానున్నారు. హైద్రాబాద్‌లోని తన ఇంటి నుంచి ఈ రోజు ఉదయమే బయల్దేరారాయన అమరావతికి రోడ్డు మార్గం ద్వారా....

నిశ్చితార్థ వార్తలు కొట్టి పారేసిన సురేష్‌బాబు

ఈ రోజు ఉదయం నుండి కూడా సోషల్‌ మీడియాలో రానా వివాహ నిశిత్చార్థం అంటూ తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. తాను ప్రేమించిన అమ్మాయి మిహీకా బజాజ్‌తో రానా వివాహ నిశ్చితార్థం...

కరోనా కష్ట కాలంలో వైసీపీ సంబరాలు సమంజసమా.?

కరోనా వైరస్‌ ముప్పు రోజురోజుకీ పెరుగుతోంది. ఈ తరుణంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ‘ఏడాది పాలన’ సంబరాలకు సమాయత్తమవుతోంది. ఈ నెల 23 నుంచి వారం రోజులపాటు సంబరాల కోసం అటు ప్రభుత్వం...