Switch to English

తిరుమలేశా.. ఈ కరోనా ‘కోతలు’ ఏంటయ్యా.!

విద్య, వైద్యం మాత్రమే కాదు.. భక్తి కూడా మార్కెట్‌లో మంచి డిమాండ్‌ వున్న వ్యవహారమే. అందుకే, భక్తుల్ని నిలువు దోపిడీ చేసేస్తున్నాయి ప్రభుత్వాలు. తిరుమల తిరుపతి దేవస్థానం.. అంటే, అది రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రం.. అనే వాదన ఎప్పటినుంచో వుంది. అందులో వాస్తవం లేకపోలేదు. అధికార పార్టీ, తమకు అత్యంత సన్నిహితులైనవారిని టీటీడీకి సంబంధించి కీలక పదవుల్లో నియమించడం చూస్తూనే వున్నాం. కేంద్ర మంత్రి పోస్ట్‌తో సమానంగా టీటీడీ ఛైర్మన్‌ పదవికి ‘గిరాకీ’ వుందంటే.. పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

అసలు విషయానికొస్తే, వెంకన్న ఆదాయం.. తప్పు తప్పు టీటీడీ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది కరోనా వైరస్‌ కారణంగా. దాంతో, ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కష్టమయ్యే పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా టీటీడీ ఉద్యోగులకూ వేతనాల కోత అమలవుతోంది. ఇది ‘కోత’ కాదు, ‘సర్దుబాటు’ అని ప్రభుత్వం చెబుతున్నా, జీతాల కోతతో ఉద్యోగులు విలవిల్లాడుతున్నారు.

టీటీడీ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. టన్నుల కొద్దీ బంగారం, వేల కోట్ల రూపాయల బ్యాంకు డిపాజిట్లు.. వెరసి పెద్ద కథే వుంది. మరి, అలాంటి టీటీడీ సుమారు 100 కోట్లు వెచ్చించి, ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వేతనాలు ఇవ్వలేదా.? సగటు భక్తుడిలో మెదులుతున్న ప్రశ్న ఇది. ‘ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తప్పడంలేదు..’ అని టీటీడీ బుకాయింపులు మామూలే.

వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక, టీటీడీలో చాలా మార్పులొచ్చాయి. అద్దె గదుల రేట్లు పెరిగాయి.. లడ్డూ రేటు పెరగడం తెల్సిన విషయమే. టీటీడీ అంటే, భక్తులకి సౌకర్యాలు కల్పించడం కాదు, వీఐపీల సేవలో తరించేదేనన్న అభిప్రాయం రోజురోజుకీ బలపడిపోతున్న పరిస్థితుల్ని చూస్తున్నాం. భక్తులకు అవసరమైన మేర, తక్కువ ధరలో లడ్డూ ప్రసాదం అందించలేని ఆర్థిక సమస్యల్లో టీటీడీ వుందా.? అన్న భక్తుల ప్రశ్నకు టీటీడీ వద్ద సమాధానం దొరకదు.

మరి, వేల కోట్ల డిపాజిట్లతో ఏం చేస్తున్నట్లు.? ఏవేవో లెక్కలు టీటీడీ చెప్పడం మామూలే. సామాన్యుడికి ఓ పట్టాన అర్థం కావవి. టీటీడీ తరఫున అన్న ప్రసాదం వంటి కార్యక్రమాలు చేపడుతున్నా, వాటికి నిత్యం వచ్చే విరాళాలు తక్కువేమీ కాదు. ఎలా చూసినా, టీటీడీకి ఆర్థిక ఇబ్బందులన్నది వట్టిమాటే. కానీ, టీటీడీ ఉద్యోగుల జీతాల్లో కోత. ఇదే వైపరీత్యమంటే.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

రోడ్డెక్కిన బస్సులు.. భయం భయంగానే ప్రయాణం.!

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ కంటే తెలంగాణ ముందుంది. తెలంగాణలో ఇప్పటికే బస్సులు రోడ్డెక్కగా, ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచే బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతానికైతే ఛార్జీల పెంపు...

బిగ్ స్టోరీ: ఈ ‘సినిమా’ కష్టాలు ప్రభుత్వాలకి అర్థమవుతాయా.!

కరోనా వైరస్‌ నేపథ్యంలో సినిమా షూటింగులు ఎప్పుడో ఆగిపోయాయ్‌.. సినిమా థియేటర్లూ మూతబడ్డాయ్‌. లాక్‌డౌన్‌ సడలింపులతో సినీ పరిశ్రమకూ కొంత ఊరట కలుగుతుందని అంతా భావించారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌కి సంబంధించిన పనులు చేసుకోవచ్చని...

ఫ్లాష్ న్యూస్: తల్లి శవంను రోడ్డున పడేసిన కొడుకు

వృద్యాప్యంలో తమకు తోడుగా ఉండి, చనిపోయిన సమయంలో దహన సంస్కారాలు చేస్తారనే ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరు కూడా కొడుకో లేదంటే కూతురు కావాలని కోరుకుంటారు. కాని మంగళగిరికి చెందిన ధనలక్ష్మి అనే అభాగ్యురాలు...

క్రైమ్ న్యూస్: కుక్కపై కోపం అతని ప్రాణాలే తీసింది..

పక్కింటివారి పెంపుడు కుక్క తనను చూసి మొరిగిందని ఆగ్రహానికి గురయ్యాడో వ్యక్తి. ఆ కోపంలో తాను చేసిన పనికి ప్రాణాలే పోగొట్టుకున్నాడు. ఈ విషాదకర సంఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. రాష్ట్రంలోని రోహ్తాస్...

ఏపీలో కరెంటు బిల్లుల్ని రద్దు చేయాలా.? సమంజసమేనా.!

కరోనా వైరస్‌.. ఎవరూ ఊహించని విపత్తు. ప్రపంచమే విలవిల్లాడుతోంది కరోనా వైరస్‌తో. అద్దె కోసం ఇళ్ళ యజమానులు, కిరాయిదారులపై ఒత్తిడి చేయవద్దని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అంతేనా, ఉద్యోగుల్ని తొలగించవద్దంటూ ఆయా సంస్థల్ని...