Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘ఓజీ’. ఇప్పటికే 80శాతం షూటింగ్ పూర్తి చేసుకుందీ సినిమా. థాయిలాండ్ షూటింగ్ లో పవన్ పాల్గొనాల్సి ఉండగా జనవరి నుంచి డేట్స్ ఇస్తారని సమాచారం. దీనిపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
సినిమాపై ఇప్పటికే విడుదలైన పవన్ కల్యాణ్ గ్లింప్స్, టీజర్ సంచలనాలు నమోదు చేసింది. దీంతో అభిమానులు అప్డేట్స్ కావాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూంటారు. నిర్మాణ సంస్థ కూడా అప్డేట్స్ ఇచ్చి ఉత్సాహపరచింది. ఈక్రమంలో ఓ అభిమాని.. ‘అప్డేట్ ఇచ్చి సావు ఓజీది’ అంటూ పోస్ట్ చేశాడు. దీనిపై డీవీవీ సంస్థ స్పందించింది.
‘అప్డేట్స్ ఇవ్వకుండా చావనులే. ఉన్నప్పుడు ఇస్తా. అప్పటివరకూ సీజ్ ది షిప్’ అంటూ బ్రహ్మానందం గిఫ్ జోడించింది. ఇలానే పలువురు అభిమానుల ప్రశ్నలకు స్పందించింది యూనిట్. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓజీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కల్యాణ్ సైతం.. సినిమా మీకు నచ్చుతుందని ఓ సందర్భంలో చెప్పడం విశేషం.
Update ivvakundaa Saavanu le ra. Unnappudu isthaaa…. Seize the Ship for now. pic.twitter.com/skaPLfW4BM
— DVV Entertainment (@DVVMovies) November 30, 2024