Switch to English

ఆర్ఆర్ఆర్ కు చిక్కుల మీద చిక్కులు

రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా భారీ చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా షూటింగ్ ఏడాదిన్నర నుండి సాగుతోంది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ ను పూర్తి చేసారు. లాక్  డౌన్ లేకపోయి ఉంటే ఈపాటికి మెజారిటీ భాగం షూటింగ్ కానిచ్చేసేవారే, కానీ దాదాపు 60 రోజుల నుండి షూటింగ్ అన్నది లేదు. రీసెంట్ గా నిర్మాత దానయ్య మాట్లాడుతూ సంక్రాంతికి చెప్పినట్లుగా ఆర్ ఆర్ ఆర్ ను తీసుకురాలేమని స్పష్టం చేసాడు. ఇక తర్వాత ఉన్నది సమ్మర్ కావడంతో అప్పటికి సినిమా విడుదలవుతుంది అని అందరూ ఊహిస్తున్నారు. అయితే అప్పటికైనా సినిమా విడుదలవుతుందా అన్నది ప్రశ్నర్ధకంగా మారింది. ఎందుకంటే ఈ చిత్రానికి ఎన్నో చిక్కులు ఉన్నాయి.

ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ తన కెరీర్ లో ఇప్పటివరకూ ఇంతలా ఇబ్బంది పెట్టిన సినిమా మరొకటి లేదు అని ప్రకటించాడంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. బాహుబలి షూటింగ్ కన్నా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కష్టమా అనిపిస్తోంది. చూస్తుంటే నిజమే అనిపిస్తోంది కూడా అని అన్నాడు. ఇంతలా ఏ సినిమాకూ ఇబ్బంది పడలేదని, లాక్ డౌన్ అయ్యాక పరిస్థితిని బట్టి షూటింగ్ షెడ్యూల్స్ అప్డేట్ చేసుకోవాలని అన్నాడు.

ఈ సినిమాకు అన్నిటికంటే ముందున్న సవాల్ షూటింగ్ లొకేషన్స్, కాస్ట్ అండ్ క్రూ ను ఒకచోట చేర్చడం. ఆర్ ఆర్ ఆర్ లో కేవలం తెలుగు వాళ్ళే కాకుండా ఇండియా వైడ్, అంతర్జాతీయ కాస్ట్ అండ్ క్రూ పనిచేస్తోంది. వచ్చే నెల నుండి షూటింగ్ లకు పరిమితులు వచ్చినా కూడా ప్రస్తుతం విమానయానం మీద నిషేధం అలానే కొనసాగుతోంది. పైగా ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమా షూటింగ్ చేయాలంటే వందలాది మంది కష్టపడాలి. షూటింగ్ కు అనుమతి వచ్చినా పరిమిత మందితో షూటింగ్ ను ఏ మేరకు నిర్వహించగలరు అన్నది చూడాలి.

పైగా ఈ సినిమాను భారీ రేట్లకు అమ్మాలని నిర్ణయించుకున్నారు. భారీ బడ్జెట్ కాబట్టి ఆ మాత్రం రేటు పెట్టాల్సిందే. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఆర్ధిక మందగమనం కొనసాగుతోంది కాబట్టి ఏ మేరకు గిట్టుబాటు అవుతుంది అన్నది కూడా చూడాలి. ఈ కష్టాలన్నీ దాటుకుని ఆర్ ఆర్ ఆర్ కనీసం సమ్మర్ కైనా వస్తుందా అన్నది అనుమానమే.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

మిడతలను తరమికొట్టేందుకు రైతు వినూత్న ప్రయత్నం

‘నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఈ ఏడాది అందరికీ శుభాలు జరగాలి’ అంటూ చెప్పుకుని రోజులు గడవక ముందే ప్రజలకు కష్టాలు మొదలైపోయాయి. కరోనా రూపంలో వచ్చిన ఉపద్రవం ప్రపంచ మానవాళిపై విరుచుకు పడుతోంది....

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

లిక్కర్‌ యాప్‌ గంటలో లక్ష

కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. గత మూడు నెలలుగా ఇండియాను కూడా కరోనా గడగడలాడిస్తూనే ఉంది. ప్రస్తుతం ఇండియాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పలు...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు....

టీడీపీ మహానాడు.. కొత్త నాయకత్వమే దిక్కు.!

తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందా.? ఈ ప్రశ్న ఇప్పుడు మహానాడు సందర్భంగా టీడీపీ కార్యకర్తల్ని వేధిస్తోంది. నిజానికి, 2014 ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ తన ఉనికిని దాదాపుగా కోల్పోయింది. అయితే,...