Committee Kurrollu: మెగా డాటర్, నటి నిహారిక నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా ‘కమిటీ కుర్రోళ్ళు’. సినిమా ఆగష్టు 9న విడుదల కానుంది. ఇటివల నిర్వహించిన ప్రీ రిలీజ్ తర్వాత ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత బజ్ క్రియేట్ అయ్యింది. సరికొత్త కంటెంట్ తో తెరకెక్కిన సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై నిర్మాతలు పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు. వంశీ నందిపాటి సినిమాను విడుదల చేస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. యూత్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ గా తెరకెక్కించిన సినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరాతోపాటు 11మంది యువకులు నటించారు. కంటెంట్ ఉన్న యూత్ ఫుల్ మూవీస్ ను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని టీమ్ నమ్మకంగా ఉంది. సినిమాలో మంచి కంటెంట్ ఉందని ప్రేక్షకులు ఆదరించాలని మెగాస్టార్ చిరంజీవి వీడియో సందేశం ఇచ్చారు.