వైసీపీ హయాంలో వైసీపీకి 50 శాతం ఓటు బ్యాంకు వుండేది గనుక, వైసీపీని వ్యతిరేకించే సినీ ప్రముఖుల సినిమాల్ని ఆంధ్ర ప్రదేశ్‌లో ఆ యాభై శాతం మంది చూడరు.! ఇప్పుడు వైసీపీ అధికారంలో లేకపోయినా, వైసీపీకి 40 శాతం ఓటు బ్యాంకు వుంది గనుక, ఆ నలభై శాతం మంది, ‘కమిటీ కుర్రాళ్ళు’ సినిమాని చూడరట.!
పాత్రికేయం ముసుగులో ఉన్మాదాన్ని నరనరానా జీర్ణించుకునప్పుడే ఇలాంటి నీఛ నికృష్ట రాతలు పుట్టుకొస్తాయేమో.? ఏమాత్రం ఇంగితం లేకుండా, ‘పాత్రికేయం’ పేరుతో చెత్తనంతా పోగేసి పాఠకుల మీదకు వదిలే వ్యవహారాన్ని ఏమనాలి.?
నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రాళ్ళు’ సినిమా మీద నీలి కూలి మీడియా విషం చిమ్ముతోంది. కారణం నిహారిక, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి అన్న కూతురు కావడమే. సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో ‘పదకొండు’ నెంబర్ చుట్టూ హైపర్ ఆది ఓ సెటైరికల్ కామెంట్ చేశాడు.
‘మా చరణ్ అన్న నటించిన సినిమాకి ఆస్కార్ వచ్చింది.. మా బాబాయ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు.. అలా మా కుటుంబానికి అన్నీ కలిసొచ్చాయ్.. నా సినిమా కూడా హిట్టయిపోవాలి..’ అని నిహారిక ఆకాంక్షించింది ఆ సినిమా ఫంక్షన్‌లో.
అంతే, వైసీపీకి ఒళ్ళు మండిపోయింది. వైసీపీ సంగతేమోగానీ, నీలి కూలి మీడియాకి అస్సలు ఈ వ్యాఖ్యలు మింగుడు పడలేదు. నలభై శాతం ఓటు బ్యాంకు వుంది కాబట్టి, ఆ ఓటు బ్యాంకుని కూడా దృష్టిలో పెట్టుకుని సినీ జనాలు మాట్లాడాలంటూ లిల్లీ పుట్ హెచ్చరికలు జారీ చేసేస్తోంది నీలి కూలి మీడియా.
నలభై శాతం మంది ఆ సినిమాని వ్యతిరేకిస్తే, మిగిలిన అరవై శాతం మంది ఆ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకుని హిట్ చేసేస్తారా.? ఏంటి.? వైసీపీ హయాంలో వైసీపీ తీసుకున్న ‘యాత్ర-2’ సినిమా హిట్టయిపోయిందా.? రామ్ గోపాల్ వర్మతో వైసీపీ తీయించుకున్న సినిమాలు బాగా ఆడేశాయా.?
పావలా కూలీకి పది రూపాయల పని చేస్తున్న నీలి కూలి మీడియా కష్టాలు.. నవ్వులపాలవుతున్నాయ్.!