అర్జున్ రెడ్డి ఎఫెక్ట్ అనాలా.. లేక ఇప్పుడున్న ట్రెండ్ కి అనుగుణంగా .. సినిమాల్లో బూతు పెరుగుతుందా అన్నది చెప్పలేం. ఎందుకంటే బూతు అన్నది ఒక్క సినిమాల్లోనే ఉందంటే ఎవ్వరు నిజం ఒప్పుకోరు .. ఎందుకంటే మనం వాడుతున్న స్మార్ట్ ఫోనులోనే టన్నులకొద్దీ బూతు ఉంది. ఆ విషయం పక్కన పెడితే తాజాగా ఓ దర్శకుడు పచ్చిగా నిజాలు చెబుతా అంటూ ఓ సినిమా పోస్టర్ విడుదల చేసారు. ఆ పోస్టర్ చుసిన వాళ్లంతా షాక్ అయ్యారు. బాబోయ్ .. ఏంటి మరి ఇంత పచ్చిగానా ? అంటూ !! ఎందుకంటే ఆ పోస్టర్ లో ఉన్నది అలాంటి కంటెంట్ మరి.
ఆ సినిమా పేరే .. కమిట్మెంట్ ? టైటిల్ లోనే కండోమ్ డెసైజ్ వాడుతూ పోస్టర్ లో ఓ బెడ్ .. దాని పక్కన విడిచిన డ్రెస్, అమ్మాయి బ్రా, షూ స్ అబ్బో .. ఇలా అన్ని విడిచిన వస్తువులతో పాటు చెరిగిన బెడ్ .. ఇవన్నీ చూస్తుంటే అక్కడ ఏమి జరిగిందో అందరికి క్లీయర్ గా అర్థం అవుతుంది. టైటిల్ చూస్తుంటే ఇదేదో సినిమా రంగానికి సంబంధం ఉన్న కాన్సెప్ట్ అని చెప్పకనే చెప్పినట్టు ఉంది. ఎందుకంటే కమిట్మెంట్ అన్న పదం ఎక్కువగా వాడుతున్నది పరిశ్రమలోనే కాబట్టి. ఆ కమిట్మెంట్ వల్ల .. మీ టూ వ్యవహారం పుట్టుకొచ్చింది. ఇప్పటికే శ్రీ రెడ్డి రచ్చ రచ్చ చేస్తూనే ఉంది.
ఈ కమిట్మెంట్ ని బేస్ చేసుకుని సినిమా చేస్తున్నాడు దర్శకుడు లక్ష్మి కాంత్ చెన్నా. హైద్రాబాద్ నవాబ్స్, నిన్న నేడు రేపు లాంటి సినిమాలు తెరకెక్కించిన లక్ష్మి కాంత్ చెన్నా చాలా రోజుల గ్యాప్ తరువాత ఈ సినిమా చేస్తున్నాడు. కొత్త నటీనటులతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా పోస్టర్ తోనే ఇలాంటి సంచలనం రిపీట్ .. రేపు సినిమా విడుదల తరువాత పరిస్థితి ఏమిటో మరి !!
