The Elephant Wishperers: ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ డాక్యుమెంటరీలో ప్రధాన పాత్రధారులైన బొమ్మన్, బెల్లీ దంపతులను తమిళనాడు సీఎం స్టాలిన్ శాలువా కప్పి జ్ఞాపికతో సత్కరించొ చెరో లక్ష నగదు చెక్కులను అందజేశారు. నిజజీవితంలో నీలగిరి జిల్లా మదుమలైలోని దిక్కులేని ఏనుగులను చేరదీసి వాటి సంరక్షణ బాధ్యతలు చూస్తున్న ఈ దంపతుల ఇతివృత్తంతోనే ఈ డాక్యుమెంటరీ తెరకెక్కడం విశేషం. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలోని మదుమలై, అన్నామలై ఏనుగు శిబిరాల్లో పనిచేస్తున్న 91 మందికి ఒక్కొక్కరికీ 1లక్ష చొప్పున సాయం ప్రకటించారు. వీరంతా ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.9.10కోట్లు మంజూరు చేశారు. కోయంబత్తూరు జిల్లాలోని అన్నామలై టైగర్ రిజర్వ్ లో ఉన్న ఏనుగుల శిబిరాన్ని 5కోట్లతో ఆధునీకరించనున్నారు. అదే జిల్లాలోని సవాడివాయల్ లో అన్ని సౌకర్యాలతో నూతన ఏనుగుల శిబిరాన్ని నిర్మించాలని ఆదేశించారు. సీఎం స్టాలిన్ వీరిని సత్కరించినందుకు సంతోషంగా ఉందని డాక్యుమెంటరీ డైరక్టర్ కార్తికి గోంజాల్వెస్ అన్నారు.
#TheElephantWhisperers #AcademyAwards பெற்று, நம் வனத்துறை செயல்பாடுகளை உலகறிய செய்துள்ளது.
திருமிகு.பொம்மன் – பெள்ளியைப் பாராட்டி ரூ.1 லட்சம் வழங்கி, தெப்பக்காடு & கோழிகமுத்தி யானைகள் முகாம் 91 பணியாளர்களுக்கு தலா 1 லட்சமும், வீடுகள் கட்ட ரூ.9.10 கோடி நிதியுதவியும் அறிவித்தேன். pic.twitter.com/mtJgnnZl8G
— M.K.Stalin (@mkstalin) March 15, 2023
341331 833717Some truly nice and utilitarian info on this internet internet site , besides I feel the layout holds great features. 308445
225311 97333This website is often a walk-through like the info you wanted in regards to this and didnt know who to question. Glimpse here, and youll certainly discover it. 450910