దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో ఏపీ ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన పెవిలియన్ ను సీఎం జగన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రాష్ట్రంలో పరిశ్రమలకు, పెట్టుబడులకు అవకాశాలనూ వివరిస్తూ ఏపీ పెవిలియన్ ను ప్రభుత్వం రూపొందించింది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్‌తో సీఎం సమావేశమయ్యారు. పారిశ్రామికంగా ఏపీలో ఉన్న అవకాశాలను సీఎం వివరించారు. డబ్ల్యూఈఎఫ్ హెల్త్ విభాగాధిపతి డాక్టర్ శ్యాం బిషేన్‌తో భేటీ అయ్యి ఆరోగ్య రంగంపై చర్చించారు. బీసీజీ గ్లోబల్ ఛైర్మన్ హాన్స్ పాల్‌తో బక్నర్‌తో సీఎం భేటీ అయ్యారు.
మహారాష్ట్ర టూరిజం మంత్రి ఆదిత్య థాకరే సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. పర్యటనలో సీఎం జగన్ తో అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్ గౌతం అదానీ అన్నారు. నేటి సాయంత్రం డబ్ల్యూఈఎఫ్ కాంగ్రెస్ వేదికలో జరిగే వెల్‌కమ్ రిసెప్షన్‌లో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. మే 26 వరకు ఈ సదస్సు జరగనుంది.