Switch to English

ఉద్యోగులు, విద్యార్థులకు సీఎం చంద్రబాబు సంక్రాంతి కానుక..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,934FansLike
57,764FollowersFollow

సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, విద్యార్థులు, చిన్న కాంట్రాక్టర్లకు సంక్రాంతి కానుక ప్రకటించారు. అన్ని వర్గాలకు కలిపి రూ.రూ. 6700కోట్లు బిల్లులను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి కానుకగా ఈ వర్గాలకు సంబంధించిన అన్ని పెండింగ్ బిల్లులను విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. ఇందులో ఆర్థికశాఖ స్థితిగతులపై చంద్రబాబు నాయుడు పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు జీపిఎఫ్, సరెండర్ లీవులు, సిపిఎస్ కంట్రిబ్యూషన్ కలిపి మొత్తం రూ. 1300 కోట్లు చెల్లించాల్సి ఉంది. కాగా ఉద్యోగులకు రూ. 519 కోట్లు జీపిఎఫ్ విడుదల చేయనుఉన్నారు.

పోలీస్ డిపార్టుమెంట్ కు సంబంధించి సరెండర్ లీవులకు గాను రూ.214 కోట్ల విడుదల చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఈ నిధులతో 54 వేల 900 మంది పోలీసులకు మేలు జరగబోతోంది. వీటితో పాటు రూ. 300 కోట్ల ఒక నెల సిపిఎస్ కంట్రిబ్యూషన్ కూడా విడుదల చేశారు. సిఎస్ఎస్ స్కీమ్స్ కు రూ. 627 కోట్లు, టిడిఎస్ చెల్లింపులు రూ. 265 కోట్లు చెల్లించాలిన ఆదేశించారు. వీటితో పాటు ఏపీకి గుండెకాయ లాంటి అమరావతి రాజధానికి, గన్నవరం ఎయిర్ పోర్టుకు భూములు ఇచ్చిన రైతులకు రూ.244 కోట్లు కౌలు చెల్లింపు కింద విడుదల చేశారు. ఇవే కాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు రూ.400 కోట్లు, డ్రగ్స్, మెడిసిన్స్ కోసం రూ.100 కోట్లు చెల్లించారు. అలాగే విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ కింద రూ.788 కోట్లు విడుదల చేశారు.

ఈ నిధులతో 6.5 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరబోతోంది. కాంట్రాక్టర్ల బిల్లులు రూ.10 లక్షల లోపు ఉన్న అన్నింటినీ రిలీజ్ చేస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. వీటి కోసం రూ.506 కోట్లు విడుదల చేయాలన్నారు. దీంతో గత ఐదేండ్లుగా ఇబ్బందులు పడుతున్న 26,000 వేల మందికి లబ్ది చేకూరుతోంది. వీటితో ఎంఎస్ఎంఈ కింద రూ. 90 కోట్లు విడుదల చేస్తామన్నారు. దాంతో 651 కంపెనీలతో పాటు 6651 మందికి లబ్ది జరుగుతోంది. దీంతో పాటు విద్యుత్ శాఖ్ డిస్కంలకు రూ. 500 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పెండింగ్ లో ఉన్న నిర్వహణా బిల్లులు రూ.366 కోట్లు కూడా సంక్రాంతి కానుకగా చెల్లించాలన్నారు.

అలాగే పెండింగ్ లో ఉన్న మరి కొన్ని బిల్లులు, బకాయిలు కూడా విడుదల చేస్తామన్నారు. ఇలా అన్ని బిల్లులు కలిపి రూ. 6700 కోట్లు విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ పూర్తి నిధులు రేపటి నుంచే లబ్దిదారుల అకౌంట్లలో జమ అవుతాయి. సంక్రాంతి సందర్భంగా ఇంతటి భారీ కానుక ఇవ్వడంతో ఆయా లబ్దిదారులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.

సినిమా

Sanjay dutt: చనిపోతూ సంజయ్ దత్ కు ఆస్తి రాసిచ్చిన మహిళా...

Sanjay dutt: సినిమా నటులపై అభిమానం ఏస్థాయిలో ఉంటుందో నిరూపించారు ముంబైకి చెందిన నిషా పటేల్. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అంటే ఆమెకు ఎంతో...

Thandel: బస్సులో ‘తండేల్’ మూవీ ప్రదర్శన.. ఆర్టీసీ చైర్మన్ ఆగ్రహం

Thandel: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘తండేల్’ ధియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అయితే.. పైరసీ సినిమాను ఇరకాటంలో పడేస్తోంది. సినిమా రిలీజైన రెండో రోజునే హెచ్...

చరణ్ నా కొడుకు లాంటి వాడు..!

తండేల్ ఈవెంట్ లో రామ్ చరణ్ గురించి తగ్గించి మాట్లాడాడని మెగా ఫ్యాన్స్ అంతా కూడా సోషల్ మీడియాలో అల్లు అరవింద్ ని టార్గెట్ చేస్తూ...

పృథ్వీ చేసిన కామెంట్ కు సినిమా మొత్తాన్ని బాయ్ కాట్ చేస్తారా..?

సినిమా నటుడు పృథ్వీ చేసిన ఒక్క కామెంట్ కు లైలా సినిమా మొత్తాన్ని బ్యాన్ చేయాలంటూ వైసీపీ చేస్తున్న రచ్చకు అసలు అర్థం ఉందా అంటున్నారు...

విజయ్ దేవరకొండ కోసం రంగంలోకి రణ్ బీర్ కపూర్..!

విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. VD12గా వస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన...

రాజకీయం

శ్రీ రంగరాజన్ దాడిపై స్పందించిన పవన్ కళ్యాణ్..!

చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎంత ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలిసిందే. వారాంతర సెలవుల్లో భక్తులంతా ఎక్కువగా చిలుకూరు వెళ్లి స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అంతేకాదు అక్కడ గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు...

జై జనసేన.! జనసేనగా రూపాంతరం చెందిన ప్రజారాజ్యం: చిరంజీవి

‘మా ఇద్దరి లక్ష్యం ఒకటే. ప్రజారాజ్యం పార్టీని స్థాపించింది మార్పు కోసం. నా తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగుతున్నదీ మార్పు కోసమే. సినిమాల్నీ, రాజకీయాల్నీ నేను బ్యాలెన్స్ చేయలేకపోయినా, నా తమ్ముడు...

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి: ఆ నలుగురి అరెస్ట్‌తో వైసీపీ ‘డొంక’ కదులుతుందా.?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి’ వ్యవహారానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ‘సిట్’ నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుంది. వైసీపీ హయాంలో నెయ్యి కొనుగోలుకు...

గెలుపోటములు: కేజ్రీవాల్ ఓ కేస్ స్టడీ.!

దేశ రాజధాని ఢిల్లీ.. అక్కడా సమస్యలున్నాయ్.! మంచి నీటి సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు.. వాట్ నాట్.! ఢిల్లీ ప్రజలు చాలాకాలంగా చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ అంటే, పార్లమెంటు సమావేశాలు.. ప్రధాని,...

చిరంజీవి సుతిమెత్తని ‘వాతలు’ సరిపోతాయా.?

సీపీఐ నారాయణ అంటే, చెత్త వాగుడికి కేరాఫ్ అడ్రస్.! ఎర్ర పార్టీలకు తెలుగునాట ఎప్పుడో కాలం చెల్లిందన్నది బహిరంగ రహస్యం. ‘తోక పార్టీలు’ అనే ముద్ర తప్ప, వామపక్ష పార్టీలకు అసలంటూ విలువ...

ఎక్కువ చదివినవి

పీకే తో నారా లోకేష్ భేటీ.. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ?

"రాజకీయాల్లో ఏది అనుకోకుండా జరగదు. ఒకవేళ జరిగితే అది ఆ విధంగా ప్లాన్ చేయబడిందని మీరు బెట్ వేయవచ్చు" ఫ్రాంక్లిన్ డి రూజ్ వెల్డ్ - అమెరికా మాజీ ప్రెసిడెంట్. రాజకీయాల్లో ఎప్పుడూ ఏది...

విజయ్ దేవరకొండ కోసం రంగంలోకి రణ్ బీర్ కపూర్..!

విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. VD12గా వస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా...

మోనాలిసా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

మోనాలిసా భోస్లే ఎవరో తెలుసు కదా.. అదే మహా కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ కనిపించిన ఈ అమ్మాయిని నేషనల్ వైడ్ గా ట్రెండ్ చేశారు. సోషల్ మీడియా వల్ల కొందరు జీవితాలు మారిపోతాయంటే...

ఈసారి జగన్ 2.0 ని చూపిస్తా.. 30 ఏళ్లు సీఎం గా ఉంటా.. వైఎస్ జగన్

తాడేపల్లి లో ఏర్పాటుచేసిన వైసీపీ కార్పొరేటర్ల సమావేశంలో మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై విజయవాడ వైసీపీ కార్పొరేటర్లతో చర్చించారు....

అందాలతో శ్రద్ధాదాస్ అరాచకం..!

శ్రద్దాదాస్ సోషల్ మీడియాలో మళ్లీ రచ్చ లేపుతోంది. నిత్యం హాట్ పిక్స్ తో కుర్రాళ్లకు కిక్ ఇస్తోంది. ఆమె పెడుతున్న పోస్టులు ఇప్పుడు సెన్సేషనల్ గా మారిపోతున్నాయి. వయసు పెరుగుతోంది కానీ.. అందం...