Switch to English

పవన్ కళ్యాణ్ పదిహేనేళ్ళ స్నేహం.! రాష్ట్రం కోసమేనన్న చంద్రబాబు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,199FansLike
57,764FollowersFollow

ఎన్డీయే కూటమి పదిహేనేళ్ళపాటు రాష్ట్రంలో అధికారంలో వుండాలని పదే పదే ఆకాంక్షిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం, జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఈ విషయమై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిత్యం ట్రోలింగ్ జరుగుతూనే వుంది. అసలు, పవన్ కళ్యాణ్ ఎందుకు ‘పదిహేనేళ్ళ స్నేహం’ ప్రస్తావన తెస్తున్నారు.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, జన సేన పార్టీతోనూ అలానే భారతీయ జనతా పార్టీతోనూ టీడీపీ స్నేహం, పదిహేనేళ్ళపాటు ఎందుకు కొనసాగాలో తాజాగా వివరణ ఇచ్చారు. అదీ, చాలా స్పష్టంగా. మిత్రుడు, పవన్ కళ్యాణ్ ఎందుకు అలా అంటున్నారన్నదానిపై చంద్రబాబు తనదైన రీతిలో కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో, రాజధాని హైద్రాబాద్ అభివృద్ధి కోసం అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేశామనీ, తొమ్మిదేళ్ళు అధికారంలో వుండటం వల్ల, తమ వ్యూహాల్ని పక్కాగా అమలు చేయడానికి సాధ్యమయ్యిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలన్నా, పదిహేనేళ్ళపాటు కూటమి ప్రభుత్వం అధికారంలో వుండాల్సిందేనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అప్పుడే, ప్రణాళికలు ఖచ్చితంగా అమలవుతాయని చంద్రబాబు చెప్పారు.

చంద్రబాబు వ్యాఖ్యల్లో నూటికి నూరుపాళ్ళూ నిజముంది. 2014-19 మధ్యకాలంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని అయ్యింది. అదీ, చంద్రబాబు పట్టుదలతోనే. కానీ, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక, అమరావతిని పూర్తిగా మరుగున పడేశారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

ఇదంతా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు గమనించడం వల్లే, రాష్ట్రానికి అలాగే రాష్ట్ర రాజధాని అమరావతికి జరిగిన నష్టాన్ని గుర్తించడం వల్లే, వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా, 11 సీట్లకు పడేశారు 2024 ఎన్నికల్లో.

ఇదిలా వుంటే, 2024 ఎన్నికల సమయంలోనే, ‘టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ఐదేళ్ళు కాదు, పదేళ్ళు కాదు.. పదిహేనేళ్ళు అధికారంలో వుండాలి’ అని జన సేన అధినేత పవన్ కళ్యాణ్, రాష్ట్ర ప్రజలకు చెబుతూ వచ్చారు. అదే మాటని ఆయన ఇప్పుడూ చెబుతున్నారు.

చంద్రబాబు సైతం, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నారు. పరస్పర గౌరవంతో, రాష్ట్ర అభివృద్ధి దిశగా కూటమి పార్టీలు ముందడుగు వేస్తున్న దరిమిలా, పదిహేనేళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో కొనసాగడం అనేది కష్టమేమీ కాదు. కూటమి పార్టీలో కింది స్థాయి క్యాడర్, సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగుతున్నా, నారా లోకేష్ లాంటి కూటమి నాయకులు, ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

ఇంకోపక్క, కూటమికి పెద్దన్న పాత్ర పోషిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం తరఫున చేయాల్సిన సాయమంతా చేస్తూనే వున్నారు.

సినిమా

CHIRANJEEVI: ముంగిట్లో సంక్రాంతి ముగిసింది.. ధియేటర్లో ‘చిరంజీవి’ పండగ ముగియలేదు

CHIRANJEEVI: సంక్రాంతి పండగొచ్చింది.. ప్రజలను ఊళ్ళకు రప్పించింది.. కుటుంబాల్లో ఆనందాలు నింపింది.. సంబరాలు చేసింది..! వారం రోజుల సంతోషాలు, ఆనందాలు పండగ వెళ్ళిపోవడంతో పండగ సంతోషాలు...

మెగాస్టార్ మళ్లీ రికార్డుల మోత… ‘మన శంకర వరప్రసాద్ గారు’తో చిరు...

సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన స్థాయిని నిరూపించుకున్నారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న ఆయన,...

ఎన్టీఆర్‌ పోలికలే కారణమా? నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్‌కి చోటు దక్కిన...

జూనియర్ ఎన్టీఆర్… తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకమైన పేరు. నటన, డైలాగ్ డెలివరీ, డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు. అయితే...

మీనాక్షి చౌదరి మనసులో ఉన్నది ఇతడేనా? ఫస్ట్ క్రష్‌, పెళ్లి డ్రీమ్‌…...

టాలీవుడ్‌లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సినిమాల విజయం ఒకవైపు, వ్యక్తిగత విషయాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు...

సంక్రాంతి బాక్సాఫీస్ హీట్… జనవరి 17న ఎవరి దూకుడు ఎంత?

సంక్రాంతి సీజన్‌లో విడుదలైన సినిమాల మధ్య బాక్సాఫీస్ పోరు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. జనవరి 17 నాటికి థియేటర్లలో సందడి చేస్తున్న సినిమాల కలెక్షన్లు ట్రేడ్...

రాజకీయం

“YSR పేరుతో నన్ను టార్గెట్ చేస్తున్నారు”: రాధాకృష్ణ వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క ఫైర్

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మీడియా – ప్రభుత్వం మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రముఖ జర్నలిస్టు, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ రాసిన కాలమ్‌పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించడంతో ఈ...

రాజకీయ వేడి రాజుకుంది.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఘాటు విమర్శలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా జరిగిన సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ,...

టీడీపీని ముంచింది TRS – సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పతనానికి కాంగ్రెస్ కారణం కాదని, అప్పటి TRS పార్టీ మరియు కేసీఆర్ రాజకీయాలే కారణమని స్పష్టంగా చెప్పారు.  టిడిపి ని  ముంచింది...

చంటి బిడ్డతోనే ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీస్‌… నారా లోకేశ్ ప్రశంసల వెల్లువ

కాకినాడ–సామర్లకోట రహదారిపై జరిగిన ఓ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. రంగంపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ చూపిన సేవా మనసును మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. డ్యూటీలో...

చంద్రబాబు ఫైర్ స్పీచ్: NTR వర్ధంతి సభలో ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే ఈ విజయాలకు క్రెడిట్ దక్కించుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం...

ఎక్కువ చదివినవి

మెగాస్టార్ అంటే ఏంటో మళ్లీ గుర్తు చేసిన “మన శంకర వర ప్రసాద్ గారు”

“చిరంజీవి సినిమా బాగుందంట…”ఈ మాట ఈ మధ్య మళ్లీ థియేటర్ నుంచి థియేటర్‌కి, మాట నుంచి మాటకి తిరుగుతోంది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా రిలీజ్ అయ్యాక…రెండో రోజు నుంచే ఒక...

“స్వగ్రామం నుంచి స్వర్ణాంధ్ర దిశగా: సమసమాజమే లక్ష్యం”: చంద్రబాబు

నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ అభివృద్ధి దృక్పథం, పండుగల ప్రాధాన్యం, గ్రామీణ పునర్నిర్మాణం, ఆర్థిక అసమానతలపై తన ఆలోచనలను విస్తృతంగా వెల్లడించారు. గతంలో గ్రామాలకు వెళ్లడానికి...

“YSR పేరుతో నన్ను టార్గెట్ చేస్తున్నారు”: రాధాకృష్ణ వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క ఫైర్

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మీడియా – ప్రభుత్వం మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రముఖ జర్నలిస్టు, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ రాసిన కాలమ్‌పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించడంతో ఈ...

Chiranjeevi: అలాంటి ’చిరంజీవి’ మళ్ళీ తిరిగి వచ్చాడా..!? వచ్చాడు..

Chiranjeevi: ఓజీ సినిమాలో డైలాగ్.. ’అలాంటోడు మళ్ళీ తిరిగివస్తున్నాడా..?’ అని. అది పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి రాసింది. కానీ.. ’మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో చిరంజీవిని చూస్తే.. సోమవారం అయినా కలెక్షన్ల...

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సెన్సేషన్… 5 రోజుల్లోనే ₹226 కోట్ల గ్రాస్

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా...