జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ‘సీఎం అభ్యర్థి’గా బరిలోకి దిగబోతున్నారు.! జనసేన పార్టీ నుంచి ఆయనే సీఎం అభ్యర్థి. జనసేన – బీజేపీ కూటమి నుంచి అయినా పవన్ కళ్యాణే సీఎం అభ్యర్థి. మరి, ఆ జనసేన – బీజేపీతో తెలుగుదేశం పార్టీ కలిస్తేనో.? అప్పుడు కూడా పవన్ కళ్యాణే సీఎం అభ్యర్థి.! ఇందులో ఇంకో మాటకు అవకాశమెక్కడుంది.?
కానీ, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, సీఎం అభ్యర్థిత్వాన్ని వదులుకునేందుకు ఇష్టపడరు. ఇదీ అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఇంకో ఆప్షన్ చంద్రబాబుకి వుందా.? అన్నదే అసలు ప్రశ్న ఇక్కడ. లేదు, లేనే లేదు.! సో, ఆయనకు ఆప్షన్ లేనప్పుడు.. పవన్ కళ్యాణ్‌నే సీఎఎం అభ్యర్థిగా ఆయన కూడా చూడాల్సి వుంటుంది.
టీడీపీ రాజగురువు, ఓ మీడియా సంస్థ అధిపతి, పవన్ కళ్యాణే సీఎం అభ్యర్థి.. అని చంద్రబాబుకి సూచించారంటూ ఓ కథనం వడ్డించబడింది.. అదీ బులుగు మీడియా ద్వారా. నిజానికి, వైసీపీ అనుకూల మీడియాకి చెందిన ‘రాజగురువు’ కూడా ఇలాగే అనుమానిస్తున్నారు. ఇదిప్పటి మాట కాదు.. స్థానిక ఎన్నికల దగ్గర్నుంచీ నడుస్తున్న చర్చ.
సదరు బిజ్జల దేవుడుగారు అనుమానించడంతోనే, పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నేతల మాటల దాడి తీవ్రమైంది. ‘పెద్దలు’ అంటూ జనసేనాని, సదరు ‘బిజ్జల’కి గౌరవం ఇచ్చినా, ఆయన మాత్రం ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయారు. నిజానికి, 2019 ఎన్నికల సమయంలోనే సదరు ‘బిజ్జల’, కొందరు వైసీపీ ముఖ్య నేతల్ని వెంటేసుకుని, జనసేనానితో ‘పొత్తుల చర్చలు’ షురూ చేశారంటారు. అదంతా పాత కథ.
టీడీపీని కాస్త వదిలేసి మరీ, జనసేన మీద ముఖ్యమంత్రి సహా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలంతా ముకుమ్మడి మాటల దాడి, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటే, పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటన్నదానిపై వారికున్న భయాలు స్పష్టమవుతున్నాయి.
‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అని పవన్ కళ్యాణ్ అన్నారంటే, దానర్థం.. ‘మేమే అధికారంలోకి వస్తాం.. విపక్షాలన్నీ మాకు మద్దతివ్వాలి..’ అని.!