మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 154వ చిత్రాన్ని బాబీ డైరెక్ట్ చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్రానికి వాల్తెయిర్ వీరయ్య అనే టైటిల్ ను కన్సిడర్ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ సాగుతోన్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే కొద్ది రోజుల క్రితం రవితేజను ఈ చిత్రం నుండి తప్పించినట్లు వార్తలు వచ్చాయి. రవితేజ ఏకంగా 15 కోట్ల పారితోషికం అడగడంతో నిర్మాతలు కాస్ట్ కటింగ్ కోసం రవితేజ ప్లేస్ లో మరో స్టార్ హీరోను తీసుకుంటారని అన్నారు.
కానీ ఇప్పుడు ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. రవితేజ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు, వాకౌట్ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. శృతి హాసన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.
696377 428110Quite clear internet site , regards for this post. 7133
694309 630851Do you have a spam problem on this blog; I also am a blogger, and I was wondering your situation; we have created some nice procedures and we are looking to trade methods with others, why not shoot me an email if interested. 495609