Switch to English

సినిమా రివ్యూ : రాక్షసుడు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,481FansLike
57,764FollowersFollow

నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, రాజీవ్ కనకాల, కాశి విశ్వనాధ్, రవి తరుతరులు
రేటింగ్ : 2. 75 / 5
కెమెరా : వెంకట్ సి దిలీప్
సంగీతం : జిబ్రాన్
దర్శకత్వం : రమేష్ వర్మ
నిర్మాత : కోనేరు సత్యనారాయణ

అల్లుడు శీను తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ ఛాయిస్ మారింది. మాస్ కథలతో సినిమాలు చేసేందుకు అయన ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మరోసారి పోలీస్ పాత్రలో నటించేందుకు రెడీ అయ్యాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన రాక్షసన్ చిత్రాన్ని తెలుగులో రాక్షసుడు పేరుతొ రీమేక్ చేసారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాక్షసుడు ఎవరో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..

కథ :

అరుణ్ ( బెల్లంకొండ శ్రీనివాస్ ) దర్శకుడవ్వాలన్న సంకల్పంతో తిరుగుతూ ఉంటాడు. ఎన్ని ప్రయత్నాలు చేసిన అతనికి ఎవ్వరు అవకాశం ఇవ్వరు. ఆ తరువాత తన తండ్రి మరణాంతరం పోలీస్ జాబ్ చేయడానికి రెడీ అవుతాడు. పోలీస్ డ్యూటీ లో చేరిన అతనికి ఓ సవాల్ విసిరేలా వరుసగా స్కూల్ పిల్లలను దారుణంగా హతమార్చే సైకో కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో తన బావ ( రాజీవ్ కనకాల ) కూతురు కూడా కిడ్నప్ కు గురవడం .. ఆ తరువాత అదే సైకో చేతుల్లో మరణించడం జరుగుతుంది. దాంతో ఈ కేసు విషయంలో సస్పెండ్ అయిన అరుణ్ .. సొంతంగా ఇన్వెస్టిగేషన్ చేసి హంతకుడిని పట్టుకున్నాడా ? లేదా అన్నది మిగతా కథ.

నటీనటుల ప్రతిభ :

దర్శకుడిగా తిరిగే విషయంలో కానీ, ఓ పోలీస్ గా తన విధులు నిర్వర్తించే విషయంలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చక్కగా చేసాడు. పోలీస్ గా అతని ఫిజిక్ బాగా సెట్ అయింది. ఎలాంటి హీరోయిజం లేకుండా ఓ సామాన్య పోలీస్ గా బాగా చేసాడు. అయితే కొన్ని హావభావాల విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. ఇక హీరోయిన్ అనుపమ టీచర్ పాత్రలో ఆకట్టుకుంది. ఈ పాత్రలో చాలా కొత్తగా కూడా అనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో పాటలు లేకపోవడం , హీరోయిన్ పాత్రకు అంత ప్రాముఖ్యత లేకపోవడం కమర్షియల్ యాంగిల్ లో చూస్తే కొంత మైనస్ గా అనిపించే అంశం. రాజీవ్ కనకాల ఉన్నంతలో బాగానే చేసాడు. మిగతా నటీనటులు వారి వారి పాత్రల్లో చక్కగా నటించి ఆకట్టుకున్నారు. అయితే విలన్ విషయంలో అసలు ఆ ఆర్టిస్ట్ ఎవరన్న విషయాన్నీ చెప్పుకోవడానికి వీల్లేనంత మేకప్ లో ముంచేశారు .. దాంతో విలన్ విషయంలో నిరాశ కలిగేలా చేసింది.

టెక్నీకల్ హైలెట్స్ :

ఈ సినిమాకు స్క్రిప్ట్ పెద్ద బలం అని చెప్పాలి .. అయితే ఇదేమీ కొత్త కథ కాదు .. ఇప్పటికే చాలా సార్లు వచ్చిన కథ. దానికి కొత్త నేపథ్యం రాసుకున్నాడు దర్శకుడు. జిబ్రాన్ అందించిన మ్యూజిక్ సినిమా మూడ్ ని అదే టెంపోలో ఉంచేసింది. సినిమాటోగ్రఫీ సూపర్. ప్రతి షాట్ కొత్తగా అనిపిస్తుంది. కలర్, మూడ్ విషయంలో కేర్ తీసుకున్నాడు కెమెరా మెన్ వెంకట్. కథను థ్రిల్లింగ్ గా నడిపించే విషయంలో కెమెరా కీలకంగా పనిచేసింది. అయితే చాలా సన్నివేశాల్లో తమిళ సినిమా సీన్స్ అలాగే ఉంచేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు రమేష్ వర్మ .. కథను ఫ్లో మిస్ అవ్వకుండా జాగ్రత్తగా నడిపించే ప్రయత్నం చేసాడు. డైలాగ్స్ పరవాలేదు. ఇందులో దర్శకుడు కొత్తగా రాసుకున్న సన్నివేశాలు ఏమిలేవు. మొత్తానికి నేటివ్ విషయంలో ఎక్కడా ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడ్డాడని చెప్పాలి.

విశ్లేషణ :

ఇలాంటి సైకో నేపథ్యంలో అప్పట్లోనే చాలా సినిమాలు వచ్చాయి. ఇదేమి కొత్త కథ కాదు .. కానీ ఎంచుకున్న నేపథ్యం, హీరో సినిమా దర్శకుడు అవ్వాలన్న కోరికతో ఓ సైకో కథను రాసుకోవడం .. దానిపై రీసెర్చ్ చేయడం .. అతను పోలీస్ అయ్యాకా మళ్ళీ అలంటి కేసు వస్తే అది సులభంగా డీల్ చేయడం అన్నది కొత్త అంశం తప్ప మిగతా కథ చాలా సార్లు చూసేసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో యాజ్ ఇట్ ఈజ్ గా దించేశారు కాబట్టి .. ఈ సినిమా విషయంలో పెద్దగా ఎవరికీ క్రెడిట్ దక్కకపోవచ్చు. అయితే హీరోగా నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ నటనతో ఆకట్టుకున్నాడు. గత సినిమాలతో పోల్చితే అతని నటనలో మెచ్యూరిటీ కనిపిచింది. అయితే ఇంకొన్ని ఎమోషనల్ సన్నివేషాల విషయంలో బాగా చేయాలి. హీరోయిన్ అనుపమ, మిగతా పాత్రల్లో నటించిన నటులు పరవాలేదనిపించారు. మొత్తానికి రాక్షసన్ అనే టైటిల్ తో వచ్చిన ఈ సినిమా విషయంలో అసలు విలన్ ను ఎక్కడ చూపించకుండా దాచి ఉంచడం కూడా కొంత నిరాశ కలిగిస్తుంది.

ట్యాగ్ లైన్ : రాక్షసుడు … థ్రిల్ చేస్తాడు !!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు....

Chiranjeevi: రాజకీయ ప్రస్థానంపై ‘చిరంజీవి’ ఆసక్తికర వ్యాఖ్యలు..

Chiranjeevi: ‘ఇకపై నా దృష్టంతా సినిమాలపైనే.. జీవితాంతం సినిమాల్లోనే ఉంటాన’ని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఇటివల ఓ కార్యక్రమంలో రాజకీయాలపై ఎదురైన...

‘జితేందర్ రెడ్డి’ మూవీ నుంచి ‘అఆఇఈ’ లిరికల్ సాంగ్ విడుదల

'ఉయ్యాల జంపాల', 'మజ్ను' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు విరించి వర్మ. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో 'బాహుబలి' ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా వైశాలి రాజ్,...

Vijay: తల్లి కోసం ఆలయం కట్టించిన హీరో విజయ్.. కారణం ఇదే..

Vijay: ప్రముఖ తమిళ హీరో విజయ్ (Vijay) తన తల్లి కోరిక మేరకు గుడి కట్టించాడనే వార్త వైరల్ అవుతోంది. గతంలోనే ఈ వార్త ప్రచారంలోకి...

Chiranjeevi: “చిరు” సాయం.. పాదచారులకు ఇంటి నుంచి రాగి జావ

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi).. ఈ పేరు తెలుగు సినిమాపై చెరగని సంతకం. సినిమాల్లో తన సమ్మోహన నటనతో అలరిస్తున్న ఆయనే.. నిజజీవితంలో...

రాజకీయం

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...

పవన్ కళ్యాణ్ వెళితేగానీ, తిరుపతి సెట్టవలేదా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళారు, పార్టీ శ్రేణుల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి విషయమై నెలకొన్న గందరగోళాన్ని సరి చేశారు.! జనసేన నేత, టిక్కెట్ ఆశించి భంగపడ్డ కిరణ్ రాయల్, పవన్...

జనసేన యూట్యూబ్ అకౌంట్ హ్యాక్

జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఆ పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చేరవేస్తున్నారు. అయితే కాసేపటి క్రితం ఈ ఛానల్ హ్యాక్ అయింది....

ఎక్కువ చదివినవి

ఎన్నికల సిత్రం: ప్రజాస్వామ్యంలోనూ వీళ్ళంతా ‘రాజు’లే.!

జనాభా ప్రాతిపదికన ఆయా సామాజిక వర్గాలకు చట్ట సభల్లో సీట్లు దక్కడం సాధ్యమేనా.? అంటే, దళితులకు తప్ప, ఇంకెవరికీ అది సాధ్యం కాని వ్యవహారంలా మారింది. చట్ట సభల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్...

సుజనా చౌదరికి లైన్ క్లియర్ చేసిన పోతిన మహేష్.!

విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీజేపీ నుంచి మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరి ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు దేశం పార్టీకి...

వాలంటీర్లకు పది వేలు.! ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారు.?

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్నికల హామీల్లో భాగంగా, వాలంటీర్లకు నెలకు 10 వేల రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. అంతకు ముందు సామాజిక పెన్షన్లను...

Chiranjeevi: ఏమున్నావ్ బాసూ..! అదిరిపోయిన మెగాస్టార్ న్యూ లుక్

Chiranjeevi: చిరంజీవిలో ఉన్న గొప్పదనం.. లుక్స్. 15ఏళ్ల క్రితం పాలిటిక్స్ లో ఉన్నప్పుడు చిరంజీవి ఎలా ఉండేవారు.. మళ్లీ సినిమాలు చేయడంతో ఎలాంటి పిజిక్ కి వచ్చేసారనే కంపారిజన్ చాలు.. డిస్కషన్ ఓవర్....

Kona Venkat: ‘పాలిటిక్స్ వద్దంటే పవన్ వినలేదు..’ కోన వెంకట్ కామెంట్స్ వైరల్

Kona Venkat: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు తనకు మధ్య రాజకీయాలపై జరిగిన సంభాషణలు చెప్పుకొచ్చారు రచయిత కోన వెంకట్ (Kona Venkat). గతంలో అంజలి నటించిన గీతాంజలి...