Air India plane crash: అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై ప్రపంచ దేశాలు సైతం విచారం వ్యక్తం చేస్తున్నాయి. దేశాధినేతలు తమ సంతాపం తెలియజేస్తున్నారు. భారతీయ సినీ నటులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు.
చిరంజీవి.. ‘అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన విమానం క్షణాల్లోనే కూలిపోయిందనే వార్త నన్నెంతో కలచివేసింది. మాటలకు అందని విషాదం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’నని అన్నారు.
వెంకటేశ్-రామ్ చరణ్-ఎన్టీఆర్-అల్లు అర్జున్.. ‘అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎంతో బాధిస్తోంది. వారి కుటుంబాల గురించే ఆలోచిస్తున్నా’నని అన్నారు.
మంచు విష్ణు.. ‘విమాన ప్రమాదం విని నా మనసు ముక్కలైంది. బాధిత కుటుంబాలకు అండగా ఉండాల్సిన సమయమిది. రేపు ఇండోర్ లో జరగాల్సిన కన్నప్ప ప్రీ-రిలీజ్, ట్రైలర్ రిలీజ్ వాయిదా వేస్తున్నా’నని అన్నారు.
సాయిదుర్గా తేజ్.. ‘విమాన ప్రమాద దృశ్యాలు నన్నెంతో కలచి వేస్తున్నాయి. బాధిత కుటుంబాలకు నా సంతాపం తెలియజేస్తున్నా’నని అన్నారు.
బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్.. తదితరలు తమ సంతాపం తెలియజేశారు.
