చిత్రపురి హౌసింగ్‌లో 300 కోట్ల స్కాం ఆరోపణలు – అధ్యక్షుడి అరెస్ట్ కు డిమాండ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,722FansLike
57,764FollowersFollow

చిత్రపురి హౌసింగ్ సొసైటీలో ₹300 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ సినీ కార్మికులు, నాయకులు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) కార్యాలయం ముందు బుధవారం మహాధర్నా చేపట్టారు. సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ అవినీతికి పాల్పడుతున్నారని, నిజమైన సినీ కార్మికులకు ఇళ్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని వారు విమర్శించారు. ఫ్లాట్లు బ్లాక్ మార్కెట్‌లో కోట్లకు అమ్ముతున్నారని ఆరోపిస్తూ, అనిల్ కుమార్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రదర్శనలో పాల్గొన్న చిత్రపురి పోరాట సమితి, సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ, మిగిలిన 2.5 ఎకరాల భూమిలో కార్మికులకు సింగిల్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టకుండా, 1200 నుండి 4400 చదరపు అడుగుల లగ్జరీ ఫ్లాట్లు కట్టి బయటి వారికి అమ్మే యత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈక్రమంలో HMDA, CMO అధికారులతో కుమ్మక్కై అక్రమాలు చేస్తున్నారని తెలిపారు.

చిత్రపురి హౌసింగ్‌లో 300 కోట్ల స్కాం ఆరోపణలు – అధ్యక్షుడి అరెస్ట్ కు డిమాండ్

వల్లభనేని అనిల్ కుమార్‌పై ఇప్పటికే 15 FIRలు, 10 ఛార్జ్‌షీట్‌లు ఉన్నాయని, రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చినా అవినీతి ఆగలేదని నిరసనకారులు అన్నారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదని, దీంతో అవినీతి మరింత పెరిగిందని విమర్శించారు.

నిరసనకారులు ప్రధానంగా ఈ డిమాండ్లు చేశారు –

20-25 ఏళ్లుగా డబ్బులు చెల్లించి ఎదురుచూస్తున్న 6,000 మంది సభ్యులకు వెంటనే ఇళ్లు ఇవ్వాలి.

కొత్తగా మరో వెయ్యి సభ్యత్వాల నిర్ణయాన్ని రద్దు చేయాలి.

ప్రస్తుత కమిటీని రద్దు చేసి అడ్-హాక్ కమిటీ నియమించాలి.

కొత్త ట్విన్ టవర్స్‌లో కేవలం సింగిల్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మాత్రమే నిర్మించాలి.

కోర్టు ఆదేశాలను పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి.

చిత్రపురి హౌసింగ్‌లో 300 కోట్ల స్కాం ఆరోపణలు – అధ్యక్షుడి అరెస్ట్ కు డిమాండ్

ఈ ధర్నాలో కస్తూరి శ్రీనివాస్, సంకూరి రవీందర్, భద్ర, శివశంకర్ పటేల్, హేమ సుదర్శన్, గాదం లలిత, రమేష్ వర్మ, శ్రీను, సి.హెచ్. ప్రకాష్, ఓం ప్రకాష్, గోపాల కృష్ణ, మద్దినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సినిమా

బాలకృష్ణ ఆరోగ్యంపై ఏఐజీ హెల్త్ బులెటిన్.. గాయం వివరాలు వెల్లడి

నందమూరి బాలకృష్ణకు సినిమా షూటింగ్ సందర్భంగా ఎడమ మోకాలికి గాయం కావడంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు...

‘సమ్మర్ హాలిడేస్’లో జయసుధ అమ్మమ్మ లుక్ విడుదల

కథా ప్రధానమైన చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధీరజ్ మొగిలినేని, తన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్న చిల్డ్రన్ మూవీ...

Chiranjeevi Birthday Special: చిరంజీవి మాస్ సినిమాలకు C/o దొంగమొగుడు

Chiranjeevi Birthday Special: ప్రతి ఏటా ఆగష్టు నెల వస్తుందంటే మెగాభిమానుల్లో ఆనందోత్సాహలు. ప్రతి ఏటా ఆగష్టు నెల రావడంతోనే చిరంజీవి పుట్టినరోజు ఆగష్టు 22వ...

బాలయ్య త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్ష

కాకినాడలో 'NBK111' సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయానికి గురైన నటుడు నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్షించారు. బాలకృష్ణ ఆరోగ్యంపై...

Balakrishna: షూటింగ్ లో బాలకృష్ణకు గాయం.. ఆసుపత్రికి తరలింపు

Balakrishna: హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాలో...

రాజకీయం

నీట్ రగడ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చెయ్యాల్సిందేనా.?

దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు ఓ వైపు.. నీట్ వివాదం ముసుగులో అసాంఘీక శక్తుల అరాచకం ఇంకో వైపు.. వెరసి, దేశ రాజధానిలో హాట్ హాట్ వాతావరణం నెలకొంది. పోటీ పరీక్షలకు...

పవన్‌పై ఆరోపణలకు క్షమాపణ చెప్పాలి: జనసేన తెలంగాణ

హైదరాబాద్‌లోని కోడి చెరువు భూముల వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై చేసిన ఆరోపణలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జనసేన తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్...

ప్రభుత్వ పాఠశాలలే ఆదర్శం కావాలి: లోకేష్

ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి, ప్రైవేటు పాఠశాలలు కూడా చూసి అసూయపడే స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో...

కాదంబరి జెత్వానీ కేసు.. అసలు నిజాలివే!

కాదంబరి జెత్వానీ వ్యవహారం మరోసారి రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ఈ అంశంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలు పోస్టుల్లో...

పేదలకు శాశ్వత భూ పట్టాలు పంపిణీ చేసిన నారా లోకేష్

మంగళగిరిని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. "మన ఇల్లు – మన లోకేష్" కార్యక్రమంలో భాగంగా మంగళగిరి,...

ఎక్కువ చదివినవి

గుంటూరు ఘటన.. ప్రభుత్వం ఫాస్ట్ యాక్షన్, నిందితుడిపై కఠిన చర్యలు

 గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు చేపట్టింది. ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తి అధికార పార్టీకి చెందిన నాయకుడేనని తేలిన వెంటనే, తెలుగుదేశం పార్టీ...

జనసేనలో కొత్త చర్చ.. బోలిశెట్టి ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు?

జనసేన నేత బోలిశెట్టి సత్యనారాయణ చేసిన తాజా వ్యాఖ్యలు కూటమి రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పాత్ర, సీట్ల పంపిణీపై పార్టీ నాయకత్వం స్పష్టత ఇవ్వాలంటూ ఆయన...

ప్రభాస్ ‘ఫౌజీ’లో నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఫౌజీ'. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనల ప్రకారం, 'ఫౌజీ' ఒక భారీ పీరియడ్ వార్ డ్రామాగా...

గుంటూరు ఘటన.. మహిళపై దాడి కేసులో టీడీపీ నేత సస్పెన్షన్

గుంటూరు నగరంలో ఓ మహిళపై జరిగిన అమానవీయ దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణబాబు కాలనీలో తాగునీటి బోరు కనెక్షన్, మోటార్ వినియోగానికి సంబంధించిన వివాదం...

బాలుడిని ఈడ్చుకెళ్లి చంపిన మొసలి.. మామ కళ్లముందే జరిగిన దారుణం

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఘాఘ్రా నది ఒడ్డున ఉన్న వ్యవసాయ పొలానికి వెళ్లిన 12 ఏళ్ల బాలుడిపై మొసలి దాడి చేసి నీటిలోకి ఈడ్చుకెళ్లింది. మామ కళ్లముందే జరిగిన...