Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. సినిమాపై అభిమానులు, ట్రేడ్ లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన కంటెంట్ ప్రోమో, దసరా సందర్భంగా విడుదల చేసిన టీజర్ కట్ తో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. రెక్కల గుర్రంపై వస్తున్న చిరంజీవి, చిన్నారి, కథా నేపథ్యం ఆకట్టుకున్నాయి.
ఇప్పుడీ టీజర్ టాలీవుడ్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. తెలుగు సినిమాల్లో తొలి 24గంటల్లో 22 మిలియన్ వ్యూస్ తో టాప్-3 పొజిషన్లో విశ్వంభర ఉండటం విశేషం. 24గంటల్లో 23మిలియన్ వ్యూస్ వచ్చాయని.. యూట్యూబ్ లో నెంబర్ వన్ పొజిషన్లో ట్రెండ్ అవుతోందని యూవీ క్రియేషన్స్ అఫీషియల్ గా పోస్టర్ విడుదల చేసింది.
రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్టు ఇటివలే దర్శకుడు వశిష్ఠ వెల్లడించారు. త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో చిరంజీవి కెరీర్లోనే భారీ ఖర్చుతో విశ్వంభర తెరకెక్కుతోంది. 2025 వేసవికి సినిమా విడుదల కానుంది.