CHIRANJEEVI: తెలుగు సినిమాల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన హీరో మెగాస్టార్ చిరంజీవి. 45ఏళ్ల సుదీర్ఘ కెరీర్.. స్టార్ డమ్, 155 సినిమాలు.. వరుసగా చేస్తున్న సినిమాలతో ఆయనది అలుపెరుగని ప్రయాణం. తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలకు పొందిన పురస్కారాలెన్నో ఉన్నాయి. వాటిలో పద్మవిభూషణ్, పద్మవిభూషణ్, గౌరవ డాక్టరేట్, లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులు ఉన్నాయి. ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు చిరంజీవి.
IIFA-2024 ఉత్సవానికి ‘ఔట్ స్టాండింగ్ అచీవ్ మెంట్ ఇన్ ఇండియన్ సినిమా’ గౌరవాన్ని చిరంజీవి అందుకోనున్నారు. ఇంతటి పురస్కారం అందుకోనుండటంతో ఆయన అభిమానులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 2022లో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నారు. సినీ కెరీర్లో అనేక నంది, ఫిలింఫేర్ అవార్డులూ అందుకున్నారు.
కెరీర్ పరంగా ప్రస్తుతం చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్నారు. 2025 జనవరి 10న సినిమా విడుదల కానుంది. తర్వాత మరో సినిమా కూడా ప్రకటించనున్నారు.