Chiranjeevi: పెద్దల మాట చద్ది మూట అంటారు. ‘దైవం మానుష్య రూపేణా’ అనేది అదే పెద్దలు చెప్పిన అందమైన మాట. మాటలు కోటలు దాటించే ఎందరో ఉన్న సమాజం మనది. ఎందరో కోటీశ్వరులు, స్థితిమంతులు, వ్యాపారాలు, స్థిర-చరాస్తులు ఉన్నవారు మన చుట్టూ ఎందరో. కానీ, ఆపత్కాలంలో ప్రకృతి విపత్తు సమయాల్లో స్పందించేవారు ఎందరంటే.. ప్రశ్నే! కానీ, తనను, తన కుటుంబాన్ని సమాజంలో అత్యున్నత స్థానంలో నిలబెట్టిన ప్రజల రుణం తీర్చుకోవాలని తపించే వారిలో మెగాస్టార్ చిరంజీవి, మెగా ఫ్యామిలీ ముందు వరుసలో ఉంటారు. తెలంగాణ, ఏపీని ముంచెత్తిన ప్రస్తుత వరదల్లో ఆపన్నులను ఆదుకునేందుకు ముందుకొచ్చి.. కోట్లలో విరాళం అందించిన ఔదార్యం మెగా ఫ్యామిలీ సొంతం. ఈమధ్య మెగా ఫ్యామిలీ నుంచి రూ.9కోట్లు ప్రజల కోసం విరాళాలుగా వెళ్లాయంటే ఎంత పెద్ద మనసు ఉండాలి.
ఏపీలోని బెజవాడ, తెలంగాణలో ఖమ్మం, మెదక్ ప్రాంతాలకు ప్రాంతాలే వరద ముంపును ఎదుర్కొన్నాయి. రోజులకొద్దీ ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆహారం, వైద్యం అందక అల్లాడిపోయారు. ప్రభుత్వాలు శ్రమిస్తున్నా ప్రజలు మానవత్వం చాటుకోవాల్సిన తరుణం. దశాబ్దాలుగా ఎన్నో విపత్తుల సమయాల్లో ప్రభుత్వానికి, ప్రజలకు అండగా నిలిచిన చిరంజీవి మరోసారి ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు 50లక్షలు చొప్పున రూ.1కోటి ప్రకటించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. రామ్ చరణ్ సైతం ఇదే పంధాలో రెండు రాష్ట్రాలకు 50లక్షలు చొప్పున రూ.1కోటి ప్రకటించారు. పవన్ కల్యాణ్ ఇంకో అడుగు ముందుకేసి రెండు రాష్ట్రాలకు రూ.1కోటి చొప్పున రూ.2కోట్లు, రెండు రాష్ట్రాల్లో వరదలకు నష్టపోయిన 400 గ్రామాలకు రూ.1లక్ష చొప్పున రూ.4కోట్ల భూరి విరాళాన్ని ప్రకటించి ప్రత్యేకంగా నిలిచారు. సాయి ధరమ్ తేజ్ రెండు రాష్ట్రాలకు 20లక్షలు, 5లక్షలు స్వచ్చంధ సంస్థలకు సాయం అందించారు. వరుణ్ తేజ్ రెండు రాష్ట్రాలకు 10లక్షలు, ఏపీ పంచాయతీ రాజ్ శాఖకు 5లక్షలు విరాళం అందించారు.
చిరంజీవి 1987లో యముడికి మొగుడు శతదినోత్సవ వేడుకల్లోనే పత్తిరైతులను ఆదుకునేందుకు రూ.2లక్షలు విరాళంగా ఇచ్చారు చిరంజీవి. నాటి నుంచి ప్రకృతి విపత్తుల సాయంలో ఆయన స్పందన అనూహ్యం. ఆయన దారిలోనే పవన్ కల్యాణ్, రామ్ చరణ్.. వారి కుటుంబసభ్యులు నడుచుకుంటున్నారు. ఇటివలి కేరళ విపత్తుకీ రూ.1కోటి సాయం ప్రకటించి స్వయంగా కేరళ వెళ్లి ముఖ్యమంత్రికి చెక్ అందించారు చిరంజీవి. “ఇదీ మెగా ఫ్యామిలీ అంటే” సాయపడే గుణంలో వారికి సాటిలేరన్నట్టు ప్రజల కోసం ముందుకొస్తోంది మెగా ఫ్యామిలీ. మధ్యతరగతి వ్యక్తిగా ఇప్పటికీ తన గుణాన్ని మార్చుకోని నిగర్వి చిరంజీవి. సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలోనూ ఆదర్శంగా నిలుస్తూ తనలోని ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. ఇంతటి ఉన్నత మనసున్న మెగా కుటుంబం ఎంతైనా ప్రశంసనీయం.
Wheen I origunally commented I cllicked thhe “Notify me when new comments are added” checkbox aand now
each tie a commment iss added I gget ssveral e-mails
with the same comment. Is theree aany wway you can redmove mee from
tat service? Manyy thanks!