మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. వరసగా సినిమాలను లైన్లో పెట్టడమే కాక వాటన్నిటినీ పట్టాలెక్కించేసాడు. ఆచార్యను పూర్తి చేసిన చిరంజీవి కొన్ని నెలల క్రితం గాడ్ ఫాదర్ షూటింగ్ ను మొదలుపెట్టాడు. పలు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్నాక కొంత కాలం బ్రేక్ తీసుకున్నాడు.
గత నెల భోళా శంకర్ షూటింగ్ ను స్టార్ట్ చేసిన చిరంజీవి ఇప్పుడు బాబీ దర్శకత్వంలో సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. నిన్నటి నుండి ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తెలియజేసారు.
ఈ చిత్ర కాస్ట్ అండ్ క్రూ గురించి ఇంకా సమాచారం అందాల్సి ఉంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో చిరంజీవి వాల్తేర్ శీను పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.