మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో మొదట త్రిషను హీరోయిన్ గా ఎంపిక చేసిన విషయం తెల్సిందే. అయితే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించకుండానే త్రిష ఈ చిత్రం నుండి వాకౌట్ చేసింది. దర్శకుడితో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమాలో నటించట్లేదని త్రిష చెప్పుకుంది. ఇప్పుడు ఆమె స్థానంలో కాజల్ ను ఎంపిక చేసుకున్నారు. లాక్ డౌన్ పూర్తయ్యాక ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలుకానుంది. ఆ షెడ్యూల్ లో కాజల్ నటించనుంది.
త్రిష క్రియేటివ్ డిఫరెన్సెస్ అని చెప్పినా సరిగ్గా ఏం జరిగింది అన్న దానిపై ఎటువంటి క్లారిటీ లేదు. ఆమె రోల్ ను తగ్గించినందుకు హర్ట్ అయ్యి ఇలా చేసిందన్న రూమర్ ఒకటి ఉంది. అయితే ఇదే విషయంపై క్లారిటీ తీసుకునే ప్రయత్నంలో భాగంగా డైరెక్ట్ గా చిరుని ఈ విషయం గురించి అడిగితే భిన్నమైన సమాధానమిచ్చాడు.
త్రిష వాకౌట్ చేసాక నేను టీమ్ మొత్తంతో మాట్లాడాను, ఎవరితో ఆమెకు విబేధాలు లేవు. మణిరత్నం సినిమాలో ఆమెకు అవకాశమొచ్చింది. దానికి ఎక్కువ డేట్లు ఇవ్వాల్సి రావడంతో ఈ సినిమా నుండి తప్పుకుంది అంతే అని చెప్పాడు మెగాస్టార్. అయితే త్రిష ఆ విషయాన్ని దాచి క్రియేటివ్ డిఫరెన్సెస్ అని చెప్పి సైడ్ అయిపోయిందా? లేక చిరునే క్రియేటివ్ డిఫరెన్సెస్ అన్న కారణాన్ని దాచి మణిరత్నం సినిమా గురించి చెప్పాడా అన్నది తెలియాల్సి ఉంది.
801063 447155You should join in a contest 1st with the greatest blogs on the internet. I will recommend this web website! 944354