Chiranjeevi: తమిళ హీరో విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమా ఆన్ లైన్లో లీక్ అయిన విషయం తెలిసిందే. ఐదు నిమిషాల సన్నివేశంతోపాటు ఒక పాట కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. జననాయగన్ సినిమా లీక్ కావడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు ఇటువంటి చర్యలను ఖండిస్తున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు.
‘జననాయగన్ సినిమా ఆన్లైన్లో లీక్ కావడం నన్ను ఎంతో బాధించింది సినిమా అనేది ఎంతోమంది కష్టం. ప్రతి ఒక్కరి ఎఫర్ట్ పెడితేనే ఒక సినిమా వస్తుంది. ఎంతోమంది తమ కలలను తమ క్రియేటివిటీని కలబోస్తేనే ఒక సినిమా వస్తుంది. అటువంటి సినిమా ధియేటర్లలో విడుదలకు ముందే లీక్ అయితే నిర్మాణ సంస్థకి నటీనటులకి ఎంతో మందికి బాధ. ఎంతోమంది కష్టం వృధా అవుతుంది. ఇటువంటి చర్యలు ఇండస్ట్రీకి మంచిది కాదు. ఎంతోమంది క్రియేటివిటీ వర్క్ ని ఇలా ఆన్లైన్లో లీక్ చేయడం ద్వారా వాళ్ల మానసిక ధైర్యం దెబ్బతింటుంది. ఇటువంటి కష్ట సమయంలో చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ కి అండగా నిలుద్దాం. మనందరం కలిసి సినిమాని బతికిద్దా’మని అన్నారు.
కేవీఎన్ ప్రొడక్షన్స్ లో చిరంజీవి ఒక సినిమా చేయనున్నారు. బాబి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా ఏప్రిల్ 11న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.
The unfortunate leak of #Jananayagan is something that deeply concerns me.
Cinema is built on trust, effort, and the collective dreams of many.Such incidents affect all of us in the industry and remind us how crucial it is to protect our creative work.
We stand one with KVN…
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 10, 2026
