మెగాస్టార్ చిరంజీవి అంజనాదేవి గొప్ప మనసుతో గత మూడు రోజులుగా 700 మాస్క్‌లను కుట్టారు. ఆమె స్నేహితురాళ్లతో కలిసి ఈ పని చేస్తున్నట్లుగా మీడియాలో ప్రముఖంగా ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో మెగాస్టార్ తల్లి గొప్ప మనసు అంటూ ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రచారం చేశారు. అయితే అసలు విషయం ఏంటీ అంటే అది ఫేక్ న్యూస్. మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా ఫొటోలో కనిపిస్తున్నది అంజనాదేవిగారు కాదు.
ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. మీడియాలో నా తల్లి కరోనా మాస్క్‌లు తయారు చేసేందుకు మిషన్ కుడుతున్నట్లుగా వస్తున్న వార్తల గురించి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం. అందులో ఏమాత్రం నిజం లేదు. అయితే ఆ ఫొటోలో ఉన్నది ఎవరో కాని ఆమె మాస్క్‌లు కుడుతున్నారు. ఆమెకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆమె చేస్తున్న పనికి అభినందనలు అన్నారు.
మీడియాలో వచ్చిన ఈ పుకారు పెద్ద ఎత్తున వైరల్ అవ్వడంతో చిరంజీవి స్పందించాల్సి వచ్చింది. అంజనాదేవి గారు ప్రస్తుతం వృద్యాప్యంతో కదలడానికి కూడా ఇతరుల సాయం తీసుకునే పరిస్థితులో ఉన్నట్లుగా మెగా కుటుంబ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అలాంటి ఆమె మిషన్ కుట్టింది అంటూ వార్తలు రావడం, వాటిని కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రసారం చేయడం విడ్డూరంగా ఉందంటూ మెగా ఫ్యామిలీ సన్నిహితులు కామెంట్స్ చేస్తున్నారు.
It is reported in press & some media channels that my mother is doing this humanitarian work. I humbly seek to clarify that it is not my mother but whichever mother is engaged in this great act of compassion I heartily thank her for such kindness.కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే pic.twitter.com/svN4RduRUg
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 11, 2020
226382 13355Really fighter messages are supposed to amuse offer praise into the groom and bride. First time audio system watching more than the top places really should also remember you see, the senior guideline of the speaking, which is your particular person. finest man speeches brother 520848
165140 154873Paris Hilton: So lovely spending time with Manny and h 150574
892557 147314Oh my goodness! a fantastic post dude. Thanks a great deal Nevertheless I will likely be experiencing trouble with ur rss . Dont know why Not able to sign up for it. Is there everyone acquiring identical rss concern? Anybody who knows kindly respond. Thnkx 633787