Chiranjeevi: ఓజీ సినిమాలో డైలాగ్.. ’అలాంటోడు మళ్ళీ తిరిగివస్తున్నాడా..?’ అని. అది పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి రాసింది. కానీ.. ’మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో చిరంజీవిని చూస్తే.. సోమవారం అయినా కలెక్షన్ల తుపాను ఎలా చెలరేగుతోందో, థియేటర్ల దగ్గర ఎందుకు వింటేజ్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారో చూస్తే ఆ డైలాగ్ కు చిరంజీవి ఖచ్చితంగా న్యాయం చేస్తున్నారు అనిపిస్తోంది. మా చిరంజీవిగారిని మళ్ళీ మాకిచ్చారు.. అనేది పాత డైలాగ్. ’ఇది కదా.. అసలు చిరంజీవి అంటే’ అనేది కొత్త డైలాగ్. సినిమా చూస్తున్న ఫ్యాన్స్ సంబరాలతో హోరెత్తిపోతున్నారు.. ప్రేక్షకులు మాత్రం.. చిరంజీవి ఏం మారలేదు అనుకుంటున్నారు. అంతలా చిరంజీవి వన్ మ్యాన్ షో చేసేసారు.
రికార్డు ఓపెనింగ్స్ మాత్రమే కాదు.. ప్రీమియర్స్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. చిరంజీవి తెర మీద చేసిన మాయాజాలం అది. ఫైట్స్ లో ఒకటీ అరా తప్పితే ఎక్కడా డూప్ లేకుండా.. డ్యాన్స్, యాక్షన్, ఎమోషన్ లో తనకు ఎవరూ సాటిరారు అని నిరూపించారు. Gen Z కి చిరంజీవి సత్తా ఏంటో చూపిస్తున్నారు. ఆ డ్యాన్సులు, స్టైలింగ్, చార్మింగ్ లుక్స్, కామెడీ టైమింగ్, ఫైట్స్ లో స్పీడ్.. ఒకటా రెండా.. సినిమా మొత్తం తన భుజస్కందాలపై మోసి మెగా బ్లాక్ బస్టర్ అందించారు. వింటేజ్ చిరంజీవి అనే పదానికి తెరపై సాక్షాత్కారం చూపించారు. ఫ్యాన్స్, ప్రేక్షకులు చిరంజీవి చేస్తున్న మాయకు ఫిదా కావాల్సిందే. నేడు, సోమవారం అయినా కూడా బుక్ మై షోలో గంటలో 30వేల టికెట్లు తెగాయంటే టాక్ ఎంత గట్టిగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
రచయిత, దర్శకుడిగా అనిల్ రావిపూడిని ఎంత మెచ్చుకున్నా తప్పులేదు. చిరంజీవిని కాదు.. ఫ్యాన్స్ అండ్ చిరంజీవి మార్క్ ను పట్టుకున్నాడు. చిరంజీవిని ఎలా చూపిస్తే థియేటర్లు షేక్ చేయొచ్చో ఆ టెక్నిక్ పట్టుకున్నాడు. సాదాసీదా కథలో చిరంజీవిని పూర్తిగా ఇమిడ్చేసి పాత్రకు ప్రాణం పోశాడు. దానికి చిరంజీవి ప్రాణప్రతిష్ఠ చేశారు. చిరంజీవి కామెడీకి నవ్వనివారు, సెంటిమెంట్ సీన్లకు కన్నీళ్లు పెట్టుకోనివారు ఉండరు. అంత మ్యాజిక్ చేసారు. ఇక వెంకటేష్.. తన క్యామియోకి అల్ట్రా స్టైలిష్ లుక్స్ తో చక్కగా న్యాయం చేశారు. చిరంజీవి–వెంకటేష్ కాంబో ప్రేక్షకులకు ఐ ఫీస్ట్. హీరోయిన్ గా నయనతార గ్లామర్ తీసుకురావడమే కాదు.. బలమైన పాత్రలో అద్భుతంగా నటించి నిండుదనం తెచ్చింది. సంక్రాంతికి చిరంజీవి పండగ విందు ఇచ్చేశారంతే.
