Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 156వ సినిమా ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుంది. అయితే.. ఆయన తదుపరి సినిమా ఎవరితో.. దర్శకుడు ఎవరు అనే ప్రశ్నలకు ఎవరి దగ్గరా సమాధానం లేదు. దీనిపై అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నానీతో తెరకెక్కించిన ‘దసరా’ సినిమాతో సక్సెస్ సాధించిన శ్రీకాంత్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనున్నారని తెలుస్తోంది. శ్రీకాంత్ చెప్పిన స్టోరీకి ఇంప్రెస్ అయిన చిరంజీవి సినిమాకు ఓకే చెప్పారని వార్తలు వస్తున్నాయి. దీంతో తన అభిమాని.. యువ దర్శకుడితో చిరంజీవి సినిమా చేస్తారనే సమాచారం మెగాభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది.
సుకుమార్ శిష్యుడిగా ‘దసరా’ సినిమాను మాసివ్ గా తెరకెక్కించి తానేంటో నిరూపించుకున్నారు శ్రీకాంత్ ఓదెల. ప్రస్తుతం నానితోనే ‘ది ప్యారడైజ్’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పూర్తవగానే చిరంజీవి సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.