Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న 157వ సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. బింబిసార చిత్ర దర్శకుడు వశిష్ఠ (Vassishta) దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ (UV Creations) లో చిరంజీవి సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి అప్టేడ్ ను వశిష్ఠ సోషల్ మీడియాలో వెల్లడించారు.
‘మెగా సినిమాకు సంబంధించి మెగా ఆరంభం. అద్భుతమైన కథను సినిమాగా తెరకెక్కించేందుకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించామని తెలియజేస్తున్నా. సరికొత్త సినిమాటిక్ అడ్వంచర్ లోకి మిమ్మల్ని తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా’మని ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, చిత్ర నిర్మాతలు వంశీ, ప్రమోద్ తోపాటు సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడుతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
చిరంజీవి పుట్టినరోజున అనౌన్స్ చేసిన ఈ మెగా 157 మూవీ సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తి రేకెత్తిస్తోంది. హీరోయిన్లుగా అనుష్క, నయనతార, మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపిస్తున్నాయి.
A MEGA Start to the MEGA Film 🌟#MEGA157 is coming to life as we kick-off the pre-production works!
We are ready to take you all on a cinematic adventure soon!@KChiruTweets @UV_Creations @NaiduChota pic.twitter.com/6qXLlsbqds
— Vassishta (@DirVassishta) September 10, 2023