Tollywood: సినీ సెలబ్రిటీలంతా ఒక చోట కలిస్తే అభిమానులకు ఎప్పుడూ సంతోషమే. అటువంటి అరుదైన కలయికే జరిగింది. దీంతో వారి అభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ మహేశ్, ఉపాసన, నమ్రతా, అఖిల్.. తదితరులు అంతా ఒకేచోట కలిసిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
వీరందరి కామన్ ఫ్రెండ్ పుట్టినరోజు సందర్భంగా జరిగిన పార్టీలో వీరంతా కలిసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వీరు తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ముఖ్యమైన కార్యక్రమం కావడంతో వీరు హాజరై కాసేపు సందడి చేశారు. ప్రస్తుతం వీరి అభిమానులు ఫొటోను షేర్ చేస్తున్నారు
కెరీర్ పరంగా.. చిరంజీవి విశ్వంభరలో నటిస్తున్నారు. 2025 మే9న సినిమా విడుదల కానుంది. నాగార్జున కుబేర సినిమాలో నటిస్తున్నారు. రజినీకాంత్ సినిమా కూలీ సినిమాలోనూ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. రాజమౌళి సినిమా కోసం మహేశ్ సన్నద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం కానుంది.