Chiranjeevi: ఇటివల కేరళలోని వాయనాడ్ ప్రాంతంలో ప్రకృతి సృష్టించిన బీభత్సం గురించి తెలిసిందే. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి ఊళ్లు కొట్టుకుపోయాయి. దాదాపు 400మంది మృతి చెందగా.. వందలమంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఇంతటి ప్రకృతి విపత్తు చూసి యావత్ దేశం చలించిపోయింది. ఇంతటి ప్రకృతి విపత్తును చూసి చలించిపోయిన మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తో కలిసి కేరళ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కి 1కోటి రూపాయల విరాళం ప్రకటించారు.
ఈక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఈరోజు కేరళకు వెళ్లి సీఎం పినరయి విజయన్ ను కలుసుకున్నారు. స్వయంగా రూ.1కోటి చెక్కును ముఖ్యమంత్రికి అందించారు. వయనాడ్ లో జరిగిన ప్రళయంపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇంతటి ప్రకృతి విపత్తు సంభవించడం దురదృష్టకరం. బాధిత కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా. వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు.. అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అందరూ సాయం చేయాల’ని చిరంజీవి అన్నారు.
MEGA STAR ⭐ @KChiruTweets Garu ♥️ Handovered ₹1cr Cheque To Honourable Kerala CHIEF MINISTER @pinarayivijayan Garu
అన్నయ్య స్వయంగా ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారికి చెక్ అందజేసారు♥️@AlwaysRamCharan #Ramcharan #DemigodMegaStarChiranjeevi #KeralaDisaster #FloodReliefFund pic.twitter.com/Q0xmdlsftE
— 𝙺𝙰𝙺𝙸𝙽𝙰𝙳𝙰 𝙼𝙴𝙶𝙰 𝙳𝙴𝚅𝙾𝚃𝙴𝙴 (@Gowtham__JSP) August 8, 2024