CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరు. కొత్తగా చెప్పక్కర్లేని ఘనతలు. తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని సరికొత్త కోణంలో అందించిన సినీ రారాజు. 47 ఏళ్ల సినీ కెరీర్లో చిరంజీవి ఎన్నో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ రికార్డులు కూడా చూశారు. తలుపు తీస్తే గాలితోపాటు దుమ్ము కూడా వస్తుందన్నట్టు కొన్ని అపజయాలు చూశారు. కానీ, చిరంజీవి అనే పేరు ప్రేక్షకుల గుండెల్లో కోటి వీణలు మోగినట్టే మోగుతూంటుంది. ఆయన కొత్త సినిమా అంటే చాలు.. కళ్లలో ఆనందం, పెదాలపై చిరునవ్వు వచ్చేస్తుంది. ఇప్పుడిదే నిజం చేస్తోంది.. ‘మన శంకరవరప్రసాద్ గారు’. సంక్రాంతికి వస్తున్న సినిమా అప్డేట్లు చూస్తుంటూ ఫ్యాన్స్ ఆకలి, ప్రేక్షకుల ఎదురుచూపులు పెరిగిపోతున్నాయి.
ఇందుకు ఆజ్యం పోసినది.. ‘మీసాల పిల్ల..’ పాట ఒకటైతే.. చిరంజీవి లుక్ మరొకటి. వచ్చిన ప్రతి స్టిల్ లో చిరంజీవి లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతుంటే.. ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. కలర్ ఫుల్ డ్రెస్సింగ్, గ్రేసీ లుక్స్ తో చిరంజీవి పాతికేళ్ల వెనక్కు వెళ్ళారా? అనేలా. అంతటి లుక్స్ చిరంజీవిలో కనిపిస్తున్నాయి. సినిమా కథేంటో, నేపథ్యమేంటో తెలీకపోయినా చిరంజీవి లుక్స్ తో మాత్రం సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నారు. కొన్నేళ్లలో చిరంజీవి నుంచి చూడని లుక్ ఇది. మీసాల పిల్ల పాటలోనే ఆయన లుక్ అదిరిపోతే.. 6వ తారీఖున శశిరేఖ పాట అప్డేట్ ఇస్తామని యూనిట్ ప్రకటిస్తూ చిరంజీవి పోస్టర్లు వదిలింది. వైట్ ఫ్యాంట్, రెడ్ కలర్డ్ షర్ట్ లో చిరంజీవి లుక్స్ నెక్స్ట్ లెవల్ అంతే.
ఇప్పటికే విడులైన ‘బాస్’ అనే గ్లింప్స్ లో చిరంజీవి స్టయిల్, మీసాల పిల్ల పాట చివర్లో.. ‘బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా..’ అంటూ స్మూత్ గా తన స్టయిల్లో చెప్పిన డైలాగ్, ఎక్స్ ప్రెషన్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో సినిమాపై క్రేజ్ పెరిగిపోయింది. అభిమానులైతే మా చిరంజీవి మళ్లీ వచ్చేస్తున్నాడంటూ సంబరాలు మొదలెట్టేస్తున్నారు. చిరంజీవి.. మంచి ఫిట్ నెస్ తో ఆకట్టుకుంటున్నారు. రెండున్నరేళ్ళ తర్వాత వస్తున్న చిరంజీవి సినిమా కావడంతో ప్రేక్షకులెంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో.. చిరంజీవి కూడా ఏమాత్రం వారిని డిజప్పాయింట్ చేయకుండా రావడం శుభసూచకం.

