Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ఐకనిక్ సినిమాల్లో ఒకటి ‘చంటబ్బాయి’. చిరంజీవిని చిన్నపిల్లలకు చాలా చేరువ చేసిన సినిమా. జంధ్యాల రచన, దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ప్రేక్షకులకి నవ్వులు పంచడమే కాకుండా మంచి విజయం సాధించింది. సినిమాలో చిరంజీవి లేడీ గెటప్ లో అలరించడం విశేషం. దీని వెనుక ఆసక్తికరమైన ఘటనను చిరంజీవి పంచుకున్నారు.
సినిమాలోని పాటలో సందర్భానుసారం చిరంజీవి లేడీ గెటప్ వేయాల్సి ఉంటుంది. పాటలో పలికే హావభావాలు, సన్నివేశాలను జంధ్యాల వివరించి.. మీసం తీసేయాల్సి ఉంటుందని చెప్పారు. చిరంజీవి ఆలోచనలో పడినా.. సందర్భం, పాట కోసం ఓకే చెప్ప ఓ కండీషన్ పెట్టారు. పాట చిత్రీకరణ సమయంలో సెట్లో అందరూ మీసం తీస్తే చివరగా తాను తీస్తానని చెప్పారట.
దీంతో టీమ్ మొత్తం మీసం తీసేయడం.. చిరంజీవి పాట చేయడం.. హిట్ అవడం జరిగింది. ఇటివల లైలా ఫంక్షన్లో మాట్లాడుతూ.. మీసం పెంచే వరకూ మాకు కనపడొద్దని కుటుంబం చెప్పినట్టు చిరంజీవి చెప్పుకొచ్చి మరోసారి నవ్వులు పంచారు.