Switch to English

వైసీపీలోకి చిరు.. ఎందుకీ ప్రచారం?

మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి పున:ప్రవేశం చేయబోతున్నారని.. ఆయన ఏపీలోని అధికార పార్టీ వైఎస్సార్ సీపీలోకి చేరతారంటూ ఇటీవల జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. త్వరలో రాజ్యసభలో ఖాళీలు రానున్న నేపథ్యంలో వైసీపీ నుంచి చిరంజీవిని పెద్దల సభకు పంపిస్తారంటూ పుంఖానుపుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. ఇందుకు కేంద్రంలోని అధికార బీజేపీ కూడా సుముఖంగా ఉందని రకరకాల వార్తలు వెల్లువెత్తుతున్నాయి.

సైరా సినిమా విడుదలైన తర్వాత చిరంజీవి జగన్ ను కలవడం, అనంతరం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులకు మద్దతు ప్రకటించడం వంటి పరిణామాలే ఇందుకు నిదర్శనమని ఆయా కథనాలకు బలం చేకూర్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. నిజంగా చిరంజీవి వైపీపీలో చేరతారా, ఆయన్ను రాజ్యసభకు పంపిస్తారా అంటే మాత్రం దీనిని ఎవరూ ధ్రువీకరించడంలేదు. అలాంటిది ఎందుకు ఈ ప్రచారం జరుగుతోందనే చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు చెక్ చెప్పేందుకే చిరంజీవిని ప్రోత్సహించాలని జగన్ భావిస్తున్నారని, అందుకే ఆయన్ను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. వైసీపీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. చిరంజీవిని వైసీపీ నుంచి రాజ్యసభు పంపించాలనే ఆలోచన ఏదీ జగన్ మదిలో లేదని చెబుతున్నారు.

నిజానికి ప్రస్తుతం చిరంజీవి అవసరం వైసీపీకి ఎంతమాత్రం లేదు. జగన్ తన సంక్షేమ పథకాలనే నమ్ముకుని ముందుకు వెళుతున్నారు. అందువల్ల చిరును ప్రత్యేకించి రాజ్యసభకు పంపించాలని ప్రయత్నించే అవకాశం ఉండదు. ఇదంతా పక్కన పెడితే.. అసలు చిరంజీవి ఇప్పటివరకు ఈ కథనాలపై స్పందించనేలేదు. అసలు చిరుకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తీ లేదని, ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని ఆయన్ను దగ్గర నుంచి చూసినవారు చెబుతున్నారు.

పైగా ఇటీవల కమల్, రజనీ తదితరులకు కూడా ఆయన రాజకీయాలు వద్దంటూ సలహా ఇచ్చారనే వార్తలు గతంలో వచ్చాయి. పైగా ప్రస్తుతం చిరంజీవి సినిమాలపైనే తన దృష్టి కేంద్రీకరించారు, పరిశ్రమలో సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు కదులుతూ సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా నిలుస్తున్నారు. అంతేకాకుండా గత అనుభవాల దృష్ట్యా అసలు ఆయన రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే ఎవరో పనిగట్టుకుని చిరంజీవి వైసీపీలో చేరాతారనే ప్రచారం చేస్తున్నారని పలువురు విమర్శలు చేస్తున్నారు. వీటికి ఫుల్ స్టాప్ పడాలంటే అటు చిరంజీవి లేదా ఇటు వైసీపీ పెద్దలు స్పందించాల్సిందే.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

క్రైమ్ న్యూస్: కాపాడాల్సిన పోలీసే డాక్టర్ తో అసభ్య ప్రవర్తన.!

ఈ కరోనా సమయంలో డాక్టార్లు, నర్సులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులే దేవుళ్ళు అనే రేంజ్ లో ప్రజలు వారిని పొగుడుతుంటే, వారిలో కొందరు మాత్రం వారి వృత్తికే చెడ్డపేరు తెస్తున్నారు. అసలు విషయంలోకి...

ఆర్ఆర్ఆర్ కు చిక్కుల మీద చిక్కులు

రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా భారీ చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా షూటింగ్ ఏడాదిన్నర నుండి సాగుతోంది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ ను పూర్తి చేసారు. లాక్  డౌన్ లేకపోయి...

చిరు, ఎన్.టి.ఆర్ సినిమాలలో సరసన ఒకప్పటి హీరోయిన్.?

తెలుగు సినిమాలలో ప్రస్తుతం ఒకప్పటి హీరో, హీరోయిన్స్ ని, నటీనటుల్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి కాంబినేషన్స్ ని చాలా ఫ్రెష్ గా ఉండేలా డైరెక్టర్స్ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. అందులో భాగంగానే...

క్రైమ్ న్యూస్: పెళ్లి చేసుకుంటానంటూ వివాహితపై అత్యాచారం

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలో ఒక మహిళ తన భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుని ఒంటరి జీవితంను గడుపుతుంది. ఆమెకు ఒక కుమార్తె కూడా ఉంది. కూతురుతో ఒంటరిగా జీవితాన్ని...

ఫ్లాష్ న్యూస్: కరోనాతో కానిస్టేబుల్ మృతి.. పోలిస్ శాఖలో కలకలం

తెలంగాణ పోలీస్ శాఖలో పని చేస్తున్న కానిస్టేబుల్ కు కరోనా వైరస్ సోకి మరణించడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని కుల్సుంపురా పీఎస్ లో దయాకర్ రెడ్డి (37) కానిస్టేబుల్ గా పని...