Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబానికి చేసిన సాయం జీవితాంతం గుర్తు పెట్టుకుంటామని నటి ఊర్వశి రౌతేలా అన్నారు. ఊర్వశి రౌతేలా తల్లికి చిరంజీవి వైద్య సాయం అందేలా చేయడంతో ఆమె కృతజ్ఞతతో చిరంజీవి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘మా అమ్మగారికి ఎడమ కాలు ఎముకకు తీవ్రు సమస్య వచ్చింది. ఏ వైద్యం అందించినా.. ఎక్కడ వైద్యం చేయించినా సరైన పరిష్కారం మాత్రం దొరకలేదు. దీంతో నేను చిరంజీవిగారిని సంప్రదించా. ఆయన కోల్ కతాలోని అపోలో ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడారు. మా అమ్మకు అత్యాధునిక వైద్య సాయం అందేలా చూశారు. ఇప్పుడు మా అమ్మ కోలుకుంటోంది’.
‘చిరంజీవిగారు మాకు చేసిన సాయం మర్చిపోలేను. మీ అమ్మగారి ఆరోగ్యం బాగుపడుతుంది. ఆమె ఆరోగ్యంగా ఉంటారని చిరంజీవిగారు నాతో చెప్పిన మాటలు ఎంతో ధైర్యాన్నిచ్చాయి. ఆయన చేసిన సాయానికి మా కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుంద’ని అన్నారుర. దీంతో చిరంజీవి తన మంచి మనసున మరోసారి చాటుకున్నరని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.