Mega fans: తెలుగు సినీ ప్రేక్షకులకు సినీ అభిమానం ఎక్కువ. నటీనటులు నచ్చితే గుండెల్లో పెట్టి ఆరాధిస్తారు. సినిమాలనూ అదే రీతిలో చూస్తారు.. ఆదరిస్తారు. సినిమా బాగుందంటే చాలు భాషతో సంబంధం లేకుండా చూస్తారు. అందుకే నేడు దేశంలోని వేరే చిత్రపరిశ్రమ నటులు చెప్పే మాట.. ‘తెలుగు ప్రేక్షకులు సినిమాను ఆదరించే తీరే వేరు’ అని. ఇది నిజం. అయితే.. అభిమానం వెర్రితలలు వేయడం అనే మాటను నిజం చేసేది కూడా తెలుగులోనే. ఫ్యాన్స్ తమ అభిమాన హీరోల కోసం కటౌట్లు కడతారు.. గొడవలు పెట్టుకుంటారు. సోషల్ మీడియా వచ్చాక ఈ పరిస్థితి మరింత ముదిరింది. ప్రేక్షకుల ముసుగులో ఫ్యాన్ వార్స్ చేస్తారు. అసత్యాలు ప్రచారం చేస్తారు. గొడవలూ సృష్టిస్తారు. ఇందుకు నిదర్శనమే ఓ సోషల్ మీడియా హ్యాండిల్ మెగా ఫ్యాన్స్ ను ఉద్దేశించి తప్పుడు ప్రచారం చేస్తోంది. ఏకంగా పోస్ట్ చేసేసింది.
ఇటివల ‘అఖిల భారత చిరంజీవి యువత’ మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ హైదరాబాద్ లో సమావేశమైంది. సంక్రాంతికి జనవరి 10న విడుదల కాబోతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమా ఏర్పాట్ల కోసం ఈ సమావేశం నిర్వహించింది. నిజానికి చిరంజీవి ప్రతి సినిమా సమయంలోనూ ఇలా సమావేశాలు నిర్వహించి తగు ఏర్పాట్లపై.. చర్చిస్తారు. ఈసారి కూడా దీనిపై ముందే ప్రకటించారు కూడా. అయితే.. మెగా ఫ్యామిలీపై నిత్యం విషంకక్కే ఓ సోషల్ మీడియా హ్యాండిల్.. ‘త్వరలో అల్లు అర్జున్ సినిమా పుష్ప-2 విడుదల కాబోతోంది. ఇటివల జరిగిన అఖిల భారత చిరంజీవి యువత మీటింగ్లో పుష్ప-2 విడుదలకు ఫ్యాన్స్ షోస్ కు కానీ.. థర్డ్ పార్టీ షోలకు కానీ మీరు పాల్గొనద్దు, పట్టించుకోవద్దు అని అన్ని జిల్లాలు, పట్టణ చిరంజీవి ఫ్యాన్స్ కు క్లియర్ ఆదేశాలిచ్చింద’ని పోస్ట్ చేసింది.
ఈ పోస్టుపై అఖిల భారత చిరంజీవి యువత జనరల్ సెక్రటరీ బాబీ ఏడిద ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ ఆరోపణలు నిజం చేసే ఫ్రూఫ్ ఉంటే పెట్టండి. చర్యలు తీసుకుంటాను. అవాస్తవమైతే ట్వీట్ డిలీట్ చేయండి. ఫ్యాన్స్ మధ్య చిచ్చు రేపొ’ద్దంటూ ట్వీట్ కు ట్యాగ్ చేసారు. విజయవాడలో శనివారం జరిగిన పుష్ప-2 కటౌట్ వేడుకల్లో అఖిల భారత చిరంజీవి యువత వైస్ ప్రెసిడెంట్ కృష్ణప్రసాద్ పాల్గొన్న ఫొటో జత చేశారు. దీంతో సదరు హ్యాండిల్ తోకముడిచి ట్వీట్ డిలీట్ చేసింది. నిత్యం ఫ్యాన్స్ మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టే ఆ హ్యండిల్ తన కుంచిత బుద్ది చూపినట్టైంది. ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే సోషల్ మీడియా హ్యాండిల్స్ పట్ల అభిమానులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని సదరు సోషల్ మీడియా స్వయంగా చెప్పినట్టైంది.. తన కుళ్లు మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నట్టైందని చెప్పాలి.
Please refrain from spreading rumors.
We, #AkhilaBharathaChiranjeeviYuvatha, have only discussed the celebrations of #Gamechanger in all our events.
If you have any evidence kindly provide it,as the General Secretary, I will take appropriate action. Otherwise,plz delete the tweet https://t.co/ocYnrD8BN0— Bobby Yedida (@bobby_yedida) November 3, 2024