మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే. ఈ చిత్రం 200 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించి మెగాస్టార్ రేంజ్ ను మరోసారి అందరికీ చూపించింది. ఈ చిత్రం భారీ విజయం సాధించిన నేపథ్యంలో వాల్తేర్ వీరయ్య విజయోత్సవ సభను వరంగల్ లో నిర్వహించ తలపెట్టారు.
ఆ ఏర్పాట్లను సమీక్షించడానికి వరంగల్ లో తెలంగాణ చిరంజీవి యువత సమీక్ష జరగనుంది. జనవరి 26, గురువారం సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ఈ సమావేశం జరుగుతుంది. ఇందులో సభకు కావాల్సిన ఏర్పాట్లు, ఎటువంటి గొడవ లేకుండా ఎంట్రీ పాస్ లను ఎలా పంచేది ప్లాన్ చేయనున్నారు.
ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత తెలంగాణలో ఉన్న మెగా నాయకులందరూ తప్పక హాజరై ఈ సమావేశాన్ని తప్పక విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.