Switch to English

రాష్ట్ర చిరంజీవి యువత నుంచి బండ్రెడ్డు చందు సస్పెన్షన్‌

మెగాభిమాని ముసుగులో క్రమశిక్షణారాహిత్యంతో వ్యతిరేక కార్యకలాపాలకు ప్పాడుతున్న గుంటూరుకు చెందిన బండ్రెడ్డు చందుని చిరంజీవి యువత, పవన్‌కళ్యాణ్‌ అభిమాన సంఘం నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నాం.

చిరంజీవి అభిమానిగా, జనసేన పార్టీ కార్యకర్తగా ఉన్న బండ్రెడ్డు చందు నియమనిబంధనలను ఉల్లంఘిస్తూ అనేకమార్లు మెగాభిమానుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడమే కాకుండా ఇటీవల సోషల్‌ మీడియాలో లైవ్‌ పెట్టి మరీ జనసేన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందువల్ల అనివార్యంగా ఆయనపై ఈ చర్య తీసుకోవడం జరిగింది.

ఏ సంఘంలోనైనా, పార్టీలోనైనా క్రమశిక్షణగా మెలగడం తప్పనిసరి అని ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు.

బండ్రెడ్డు చందుపై ఈ సస్పెన్షన్‌ తక్షణం అములులోకి వస్తుందని ఇకపై చిరంజీవి యువత, మెగా కుటుంబంతో ఆయనకెటువంటి సంబంధం లేదని పత్రికాముఖంగా అందరికీ తెలియజేయడమైనది.

– ఎల్‌. శ్యామ్‌ప్రసాద్‌, రాష్ట్ర చిరంజీవి యువత

సినిమా

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కు కాస్ట్‌ కట్టింగ్‌ తప్పదా?

రాజమౌళి సినిమా అంటే భారీ బడ్జెట్‌కు పెట్టింది పేరు. ఈగతో సినిమా తీసినా కూడా దానికి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టిన ఘనత రాజమౌళికి...

పవన్‌ ఆ రెండు సినిమాలు ఈ ఏడాది చేయడేమో!

అజ్ఞాతవాసి తర్వాత రెండేళ్ల గ్యాప్‌ తీసుకున్న పవన్‌ కళ్యాణ్‌ కొన్నాళ్ల క్రితం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలకు కమిట్‌ అయ్యాడు. కెరీర్‌లో...

మహేష్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ మద్య రచ్చ

మహేష్‌ బాబు హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాకు అనీల్‌ రావిపూడి దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల...

కరోనాతో అల్లు వారి ‘ఆహా’లో ఢొల్ల బయటపడినది

రాబోయే రోజుల్లో ఓటీటీ రాజ్యం ఏళబోతుందని చాలా మంది అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా వంటి దేశాల్లో ఓటీటీ బిజినెస్‌ చాలా లాభసాటిగా ఉంది. ఇండియాలో...

#AA20 అప్‌డేట్‌ ఇవ్వకుంటే ఊరుకునేలా లేరుగా

అల్లు అర్జున్‌ 20వ చిత్రం సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. రంగస్థలం చిత్రం తర్వాత రెండేళ్ల గ్యాప్‌ వచ్చిన నేపథ్యంలో చాలా కసిగా ఉన్న...

రాజకీయం

జగన్‌ సారూ.. కరోనా ప్రాణం తీసింది చూడూ.!

‘పారాసిటమాల్‌ ట్యాబ్లెట్‌ వేసుకుంటే కరోనా వైరస్‌ నయమైపోతుంది.. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లితే వైరస్‌ తగ్గిపోతుంది..’ అంటూ మొదట్లో కరోనా వైరస్‌ని చాలా తేలిగ్గా తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. కరోనా...

వైఎస్‌ జగన్‌ సర్కార్‌ని పవన్‌ ప్రశ్నిస్తే.. ఎదురు దాడి చేయడమేంటి.?

జనసేన అధినేత ప్రజా సమస్యలపై పోరాటం విషయంలో ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. కష్టం ఎక్కడ వచ్చినా, బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొస్తారాయన. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంలో పవన్‌ కళ్యాణ్‌ చిత్తశుద్ధి ఏంటన్నది బాధిత...

బోయింగ్ కు కరోనా సెగ: లేఆఫ్ దిశగా…

యావత్ ప్రపంచాన్ని నిలువెల్లా వణికిస్తున్న కరోనా మహమ్మారితో వివిధ రంగాలు ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఓ వైపు మానవాళి ఆరోగ్యానికి సవాల్ గా పరిణమించిన కోవిడ్-19.. మరోవైపు ఆర్థికపరమైన సంక్షోభానికీ కారణమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా...

రెడ్డిగారి నిస్సిగ్గు రాజకీయం.. నవ్విపోదురుగాక ఆయనకేటి.!

విజయసాయిరెడ్డి.. పరిచయం అక్కర్లేని పేరిది. వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడిగా వున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోనూ ఆయనే నెంబర్‌ టూ పొజిషన్‌లో వున్నారన్నది జగమెరిగిన సత్యం. ఎంపీగా రాజ్యసభకు ప్రాతినిథ్యం...

9 నిమిషాలు.. మళ్ళీ నిరాశపర్చిన నరేంద్ర మోడీ

దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసింది ఈ రోజు ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీడియో సందేశం ఇవ్వబోతున్నారనే ప్రకటన నిన్న రావడంతో. ఏం చెబుతారు నరేంద్ర మోడీ.? లాక్‌ డౌన్‌ ఎత్తివేతపై ఆయనేమైనా...

ఎక్కువ చదివినవి

కరోనాపై ప్రజలకి వైవిఎస్ చౌదరి స్పెషల్ లెటర్

‘కుశలమా’! ‘నీకు కుశలమేనా’!! అది పాత తెలుగు సినిమా పాటా కాదు, కేవలం నాలుక మీద నుండీ దొర్లిన పదాల కలయికా కాదు. పై పదాల కలయిక.. మనం మన ఆత్మీయుల యోగక్షేమాలను తెలుసుకోవాలనుకునే తొలి ‘పలకరింపు’. మన...

ఏపీలో ఆరువారాల్లో ఎన్నికలు జరుగుతాయా?

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఎన్నికలు వాయిదా వేయడానికి ప్రధాన కారణం కరోనా ఎఫెక్ట్. కరోనా రోజు రోజుకు విస్తరిస్తున్న నేపధ్యంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం...

దాసరిపై అభిమానం నా కెరీర్‌ను నాశనం చేసింది

మంచు విష్ణు కెరీర్‌లో అత్యంత దారుణమైన ఫ్లాప్స్‌ చాలానే ఉన్నాయి. వాటిల్లో ఇంకా దారుణమైన సినిమా అంటే ఎర్ర బస్సు అని ఠక్కున చెప్పవచ్చు. దర్శకరత్న దాసరి నారాయణ రావు ఆ సినిమాను...

అభిజ్ఞ చెప్పినట్టే జరుగుతోంది!

ప్రపంచంలో పెను విపత్తు జరగబోతోందంటూ కరోనా మహమ్మారి వెలుగుచూడటానికి ఏడు నెలల ముందు అభిజ్ఞా ఆనంద్ అనే 14 ఏళ్ల బాల మేధావి చెప్పినట్టే ప్రస్తుతం జరగడం తీవ్రంగా చర్చనీయాంశమైంది. గతేడాది ఆగస్టు...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఆ స్టార్‌ అంటూ పిచ్చి పుకార్లు

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ మల్టీస్టారర్‌ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి రోజుకో వార్త వస్తూనే ఉంది. ఈ సినిమా అనే కాదు రాజమౌళి ఏ సినిమా చేసినా కూడా జనాల్లో...