Srikanth: ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించిన హీరోల్లో శ్రీకాంత్ (Srikanth) ఒకరు. మూడు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను తన నటనతో మెప్పిస్తున్నారు. మార్చి 23న తన పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ని స్వయంగా కలుసుకుని ఆశీస్సులు తీసుకున్నారు. శ్రీకాంత్ ను చిరంజీవి ఆత్మీయంగా పలుకరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
చిరంజీవి (Chiranjeevi) కి శ్రీకాంత్ పై ప్రత్యేకమైన అభిమానం. విజయవాడలో జరిగిన పెళ్లిసందడి సిల్వర్ జూబ్లీ వేడుకల్లో తన ఇద్దరు తమ్ముళ్లు ఎలానో.. శ్రీకాంత్ (Srikanth) తనకు మరో సోదరుడు అన్నారు. ఆనాటి నుంచే వీరిద్దరి మధ్య అన్నదమ్ముల బంధం ఏర్పడింది. చిరంజీవిని శ్రీకాంత్ అన్నయ్య అని ఆత్మీయంగా పిలుచుకుంటారు.
వీరిద్దరి మధ్య సోదరభావానికి గుర్తుగా శంకర్ దాదా ఎంబిబిఎస్, శంకర్ దాదా జిందాబాద్ సినిమాల్లో నటించి మెగాభిమానులను ప్రేక్షకులను అలరించారు. సినిమాల్లో వీరి కాంబినేషన్లో వచ్చిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఈ అనుబంధాన్ని కొనసాగిస్తూనే నేడు తన పుట్టినరోజున చిరంజీవి (Chiranjeevi) ఆశీస్సులు తీసుకున్నారు శ్రీకాంత్ (Srikanth).