Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) తన కుటుంబంపై ఎంతటి ప్రేమ చూపిస్తారో తెలిసిందే. పండగ, ముఖ్యమైన సందర్భాల్లో కుటుంబమంతా తన ఇంట్లో సందడి చేస్తారు. తోబుట్టువులు, వారి పిల్లలు అందరూ కలిసిన ఫొటోలు వైరల్ అవుతాయి. అంతటి ప్రేమనే మరోసారి చాటుకున్నారు. ఇటివలే ఇటలీలో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ (Varun Tej) -లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) మూడుముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఆ సందర్భాన్ని.. సందడినీ మరోసారి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
తన ఇన్ స్టా అకౌంట్ లో వరుణ్-లావణ్య పెళ్లి ఫొటో, వారిద్దరి సందడిని పంచుకున్నారు. అక్కడ జరిగిన హల్దీ వేడుకలకు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. ‘ఇటలీలో అందమైన ఓ సాయంత్రం. ఎప్పుడో కాదు.. ఈమధ్యే జరిగింది. ప్రేమతో దగ్గరైన రెండు హృదయాలు ఒక్కటయ్యాయి. ఎన్నో మధుర జ్ఞాపకాలు, మధురానుభూతులను పంచాయి. అటువంటి ఓ అందమైన క్షణాన్ని మీతో పంచుకుంటున్నా’ను అని పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. బాస్.. ఎంత మంచి మనసు మీది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram